-
-
ఇంటి పేరు ఇంద్రగంటి
Inti Peru Indraganti
Author: Srikanta Sarma
Publisher: Sahiti Mitrulu
Pages: 432Language: Telugu
నాకథ మొదలుపెట్టడానికి ముందు ఒక సంగతి చెప్పాలి. నాకు జీవితచరిత్రలు చదవడం చాలా ఇష్టం. అవి, సాధారణ చరిత్రకారులు చెప్పని, చెప్పజాలని సాంఘిక చరిత్రలు చేపుతాయి. చారిత్రకుల దృష్టిలోపడని ఘటనలు, పేర్లు వాటిలో దొరుకుతాయి. తెలుగువారి సాంఘికచరిత్ర - వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీనరసింహం, టంగుటూరి ప్రకాశం, దర్శి చెంచయ్య, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, ఆదిభట్లనారాయణదాసు, తిరుమలరామచంద్ర, వంటి వ్యక్తులవ్రాతలవల్ల బాగా నాకు అర్థమైంది. ఇలాగే స్వాతంత్ర్యోద్యమంలోనూ, కమ్యూనిస్టు ఉద్యమంలోనూ, ప్రత్యక్షంగా పనిచేసిన వ్యక్తులరచనలు కూడా ఉండిఉండవచ్చును, కొండా వెంకటప్పయ్య లాగ, శ్రీమతి కొండపల్లి కోటేశ్వరమ్మలాగ! -
అయితే - నేను ఏ ఉద్యమాలలోనూ పనిచేసినవాడినికాను. నేనెరిగినది, తెలుగు సాహిత్యంగురించి, అందు నిమిత్తంగా నడిచిన ఘటనల గురించి. ఆధునిక సాహిత్యంతో మాకుటుంబానికున్న సంబంధంగురించి నేనెరిగిన ఘటనలకు చారిత్రక ప్రాధాన్యం వుంది.
- శ్రీకాంతశర్మ
గమనిక: " ఇంటి పేరు ఇంద్రగంటి " ఈబుక్ సైజు 7mb
