-
-
ఇంతిహాసం
Inthihasam
Author: Dr. C. Mrunalini
Publisher: Chinuku Publications
Pages: 225Language: Telugu
'ఇంతిహాసం' అనే వ్యాస పరంపర ఆంధ్రజ్యోతి దినపత్రిక 'నవ్య' విభాగంలో ధారావాహికంగా ప్రచురింపబడింది. ఆ వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.
ఈ వ్యాసాలలో చాలాసార్లు చెప్పినట్టు, పురాణేతిహాసాలు పాత్ర ప్రధానాలు కావు. వాటిలో ధర్మబోధ ప్రధానం (ఆ ధర్మాన్ని మనం ఈనాడు ధర్మంగా అంగీకరిస్తామా లేదా అన్నది వేరే విషయం). ధర్మాధర్మాల సంఘర్షణ, ఆదర్శమానవ చిత్రీకరణ, మానవ జీవితం వెనక ఉన్న ఆధ్యాత్మిక భావనలు, భక్తితత్వం - ఇవన్నీ ప్రధానం. వాటికి కథలు ఒక నెపం మాత్రమే. పాత్రలు సంకేతాలు మాత్రమే. కనక, ఒక్కోసారి కొన్ని పాత్రలు హఠాత్తుగా వచ్చి, అసంపూర్ణంగా మిగిలిపోయినట్లు అనిపించవచ్చు. అతి విస్తృతమైన భూమిక నేపథ్యంగా నడిచే పురాణేతిహాసాల్లో పాత్రలన్నింటికీ ఎవరి కర్తవ్యాలు వాళ్ళకుంటాయి. అవన్నీ ఏదో ఒక ప్రయోజనం కోసం వచ్చినవే. ఈ పరిధుల్లోంచి చూసినా వాటిలో ఒక వ్యక్తిత్వం తళుకులీనుతూ ఉంటుంది. అందుకే వారిని సృష్టించిన కారణాన్నీ, వారి వ్యక్తిత్వాన్నీ రెండింటినీ గుర్తుంచుకుని వాళ్ళను అర్థం చేసుకోవలసివుంటుంది.
- డా. సి. మృణాళిని
* * *
రచయిత్రి గురించి:
తెలుగువారికి తెలిసిన పేరు. టి.వి.లతోనూ, వార్తాపత్రికల తోనూ, పుస్తకాల తోనూ పరిచయమున్న చాలామంది అభిమానించే పేరు. విస్తృత అధ్యయనం మృణాళినిగారి చిరునామా. తెలుగు, ఆంగ్ల సాహిత్యాల తులనాత్మక పరిశీలన చాల ఇష్టమైన వ్యాపకం. పురాణ, ఇతిహాసాలలోని స్త్రీ పాత్రలకి యధాతధమైన అక్షరరూపాన్ని ఇవ్వగలిగిన ప్రజ్ఞని, వరల్డ్ స్పేస్ రేడియో ద్వారా తెలుగు సాహిత్య వైభవాన్ని, సినీ పాటల సంగీత సౌరభాన్ని ప్రపంచంలోని తెలుగు వారందరికీ వినిపించిన ఘనతని, వనితా టివి ద్వారా వినూత్న కార్యక్రమాలను రూపొందించిన విలక్షతని, తొలినాళ్ళలో జాబులు జవాబులుతో దూరదర్శన్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆత్మీయబంధాన్ని, ప్రపంచ సభలలో తెలుగు సాహిత్య సాంస్కృతిక గౌరవాన్ని చాటిచెప్పఏ వక్తృత్వ పటిమను సొంతం చేసుకున్న డా. మృణాళిని అక్షరాలు తేలికగా జీర్ణమయ్యే ఉగ్గుపాలు.

- ₹108
- ₹270
- ₹75.6
- ₹540
- ₹90
- ₹216