-
-
ఇంటర్వ్యూ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్
Interview Skills Decission Making Skills Problem Solving Skills
Author: Dr. T. S. Rao
Publisher: Victory Publishers
Pages: 45Language: Telugu
Description
ఇంటర్వ్యూ స్కిల్స్
చాలామంది అభ్యర్ధులు ఇంటర్వూ గదిలోకి అనుభవం కోసం వెడతారు. కొందరు ఆ ఉద్యోగంవస్తే అంగీకరించాలా? వద్దా? అనే అనిశ్చిత భావంతో తటపాటాయిస్తారు. చాలా కొద్దిమంది మాత్రమే మనస్పూర్తిగా ఆ ఉద్యోగం కోసం వస్తారు. వారిలోనుండి తగిన అర్హతలు, అనుభవం గలవారే ఎంపికవుతారు. ఇంటర్వూ లవల్ల అభ్యర్ధి మానసికంగా ఆందోళన చెందడానికి కారణం అతని అనిశ్చితే. ఉద్యోగం కావాలని కోరుకునే అభ్యర్థికి భవిష్యత్తు అభివృద్ధిపై ఆశ కలిగేలా మార్గదర్శకత్వం కావాలి. అతనిని వెనక్కు లాగకూడదు. అభ్యర్థి ఇంటర్వూ కు కేవలం ఎంపిక కోసమేగాక తన నైపుణ్యం, భాషణల ద్వారా ఇంటర్వూ చేసేవారిని మెప్పించేందుకు భయపడకుండా హాజరుకావాలి. ఆత్మవిశ్వాసమే విజయరహస్యం.
డెసిషన్ మేకింగ్ స్కిల్స్
నిర్ణయం తీసుకోవడం అనేది ఓ కళ. చిన్న వాళ్ళుగానీ, పెద్దవాళ్ళుగానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ 'డెసిషన్ - మేకింగ్ స్కిల్స్' ని బాగా పెంచుకోవాలి. అదేమీ ఆషామాషీ విషయం కాదు. అది అలవాటు చేసుకోవాలి. దానికి తగినట్లుగాఆలోచనను విస్తృతం చేసుకోవాలి. జీవితం ఎన్నో నిర్ణయాల సమ్మేళనం. మనం తీసుకునే ప్రతి నిర్ణయం మిగిలిన వారికి భిన్నంగా వుంటుంది. ఎందుకంటే మన అనుభవాలు మనకు వుంటాయి. ఎన్నో పరంపరల నుండి నిర్ణయాలు తయారవుతాయి. ఒక నిర్ణయం తీసుకుంటేగానీ ఏదో ఒక పరిష్కారం కాదు. చక్కి లీడర్షిప్ స్కిల్‌కు డెసిషన్ - మేకింగ్ ముఖ్యలక్షణం. నిర్ణయాత్మకంగా లేనివారి పై ఎవరూ నమ్మకం వుంచరాదు. సక్సెస్ ఫుల్ లైఫ్‌ని అంటే విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్న వారిలో మీరూ వున్నారంటే మీరు ఖచ్చితంగా ఓ మంచి డెసిషన్ మేకర్ అన్నమాట.
ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్
అభివృద్ధికి అవకాశాన్ని కలిగించేదే సమస్య. 'ప్రతి సమస్య తన చేతిలో మీకోసం ఓ బహుమతిని కలిగి వుంటుందని' చెపుతారు మనో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు. ఆశావది సవాళ్ళు లేదా సమస్యాత్మక సంఘటనల గురించి ఎదురు చూస్తాడు. ఎందుకంటే వాటినుంచి బలమైన అవకాశాలు ఏమున్నాయా, ఎలా అభివృద్ధి పధంలో పయనించవచ్చా అని ఆలోచిస్తాడు. ఆ ఆలోచనలో అంతులేని ఆసక్తి దాగి వుంటుంది.ఏ సమస్యకూ పూర్తిగా పరిష్కారం వుండదు. ప్రతి సమస్యకూ పరిష్కారం వుంటుంది. కానీ ప్రతి పరిష్కారం ఓ కొత్త సమస్యను తీసుకు వస్తుంది. అందువలన మనం తెలుసుకోవలసింది ఏమంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చిన్న విషయమే. ఎందుకంటే అందులో నిరంతర అభివృద్ధి, సర్దుబాటు వుంటాయి.
Preview download free pdf of this Telugu book is available at Interview Skills Decission Making Skills Problem Solving Skills
Login to add a comment
Subscribe to latest comments
