-
-
ఇంటర్వ్యూ స్కిల్స్
Interview Skills
Author: Dr. T. S. Rao
Publisher: Victory Publishers
Pages: 100Language: Telugu
ఇంటర్వూ గదిలోకి ప్రవేశించే ముందు తలుపుపై మూడుసార్లు తట్టాలి. గదిలోకి ప్రవేశిస్తూనే ఇంటర్వూ చేసేవారికి అభివాదం (గుడ్మార్నింగ్/గుడ్ ఆఫ్టర్నూన్) చెయ్యాలి. ఇంటర్వూ అధికారి కరచాలనానికి చెయ్యి చాపితేనే అభ్యర్ధి కూడ అందుకు ముందుకు రావాలి. కుర్చీవద్దకు రాగానే ఇంటర్వూ అధికారి కూర్చోమంటేనే కూర్చోవాలి. అక్కడ మూడు నాలుగు కుర్చీలుంటే ఇంటర్వూ అధికారికి ఎదురుగా ఉండే మధ్య కుర్చీలో కూర్చోవాలి. పొరపాటు మాట్లాడితే ఒకి రెండుసార్లకంటే ఎక్కువగా 'క్షమించండి' అనే పదం వాడకూడదు. సమాధానం తెలియని ప్రశ్న విషయంలో 'తెలియదు' అని అంగీకరించాలి. తనకు పూర్తిగా తెలిసిన జవాబునైనా తొందరపాటు లేకుండ కొంచెం సమయం తీసుకుని చెప్పాలి. తనకు తెలిసిన సమాధానాన్ని అభ్యర్థి అవసరమైన మేరకు క్లుప్తంగా వివరించాలి.
ప్రశ్న మొదలుగాని చివరగాని అర్థం కానప్పుడు 'క్షమించండి, అర్ధం కాలేదు అని చెప్పాలి. ప్రశ్నకు జవాబిచ్చే సమయంలో ప్రశ్న అడిగిన వారిపైనే దృష్టి నిలపాలి. కుర్చీలో నిఠారుగా కూర్చోవాలి. కూర్చున్నప్పుడు చేతులను తొడలమీద ఉంచుకోవాలి. ప్రశ్నల మధ్యలలో ఖాళీగాని, నిశ్శబ్దంగాని సంభవిస్తే అలాగే కూర్చోవాలి. సమాధానం చెప్పే సమయంలో చేతులు తిప్పుతూ మాట్లాడ కూడదు. ఇంటర్వూ ముగింపులో అభ్యర్థి స్వయంగా అధికారితో షేక్హ్యాండ్కు ప్రయత్నించకూడదు. ఇంటర్వూ అయిన తరువాత అభ్యర్థి అధికారికి అభివాదం చేసి నవ్వు ముఖంతో బయటకు రావాలి. ఇంటర్వూ గదిలోకి ప్రవేశించేటప్పుడుగాని, బయటకి వచ్చేటప్పుడుగాని తలుపును నెమ్మదిగా మూయాలి.
PDF lo manchi informatio provide chesaru. Website lo interview skills aa kakunda life ki sambandhina informations kuda baga icharu. Naku telisina information share cheyandam valana megatha valaki help avuthindhi anni ee link http://bit.ly/2xRJr41 share chesthuna.