• In The Mood For Love
 • Ebook Hide Help
  ₹ 180
  200.004
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఇన్ ది మూడ్ ఫర్ లవ్

  In The Mood For Love

  Publisher: New Wave Books

  Pages: 226
  Language: Telugu
  Rating
  3.50 Star Rating: Recommended
  3.50 Star Rating: Recommended
  3.50 Star Rating: Recommended
  3.50 Star Rating: Recommended
  3.50 Star Rating: Recommended
  '3.50/5' From 2 votes.
  2 Star Rating: Recommended
  2 Star Rating: Recommended
  2 Star Rating: Recommended
  2 Star Rating: Recommended
  2 Star Rating: Recommended
  '2/5' From 1 premium votes.
Description

‘ప్రేమ’ అనే పదం మెదిలినప్పుడల్లా నాకు వేక్సినేషన్ గుర్తొస్తుంది. వైరస్ సోకి చావకుండా, అదే వైరస్‌ని కొంత మోతాదులో వేక్సిన్‌గా ఇస్తారు. ప్రేమా అంతే. ప్రేమే రోగం. ప్రేమే మందు. ఈ ప్రేమ కథల సమాహారం కూడా అంతే. ఈ కథలు చదువుతున్నప్పుడు కలిగిన పెయిన్‌కి, ఈ కథలే పెయిన్ రిలీవర్స్.

సంవత్సరాల నెంబరు మారుతుంది. నెలలు మాత్రం అవే. మారవు. మన జీవితంలో ఫేజెస్ మారుతుంటాయి. మనలో ప్రేమ ‘ప్రెజెన్స్’ మారదు. జనవరిలో వచ్చే సంక్రాంతి పండగ ప్రస్తావనతో మొదలైన 'ఇన్ ది మూడ్ ఫర్ లవ్' డిసెంబరులో వచ్చే క్రిస్మస్ వేడుకలు పూర్తి చేసుకుని, మళ్ళీ జనవరిని ఆహ్వానించింది. కలర్ వీల్‌లో ఉండే పన్నెండు రంగుల్లా పన్నెండు కథలు!

- చైతన్య పింగళి

***

ప్రేమ కథలా? ఇప్పుడెందుకు? అని మీరు అడగొచ్చు. ఇప్పుడే ఇలాంటి ప్రేమకథల సంకలనం అత్యవసరం అని మాకనిపించింది.

ఈ ప్రేమకథల పుస్తకం హఠాత్తుగా ఒక సాయంత్రం ఆలోచన వచ్చి ప్రచురించింది కాదు. ఆ ఆలోచనకు కనీసం మూడేళ్ళ వయసుంది.

తెలుగులో రచయితలం కొందరం, కాస్త సీరియస్‌గా రాస్తున్నాం అనే అవగాహన వచ్చేసరికి మా రచనలు చదివే చదువరులు తగ్గిపోయారనే విషయం అర్ధమైంది. అసలు ఎందుకు రీడర్స్ సరిపడాలేరు అనే ప్రశ్న సాహిత్యకారులను గత ఇరవయ్యేళ్ళుగా వేధిస్తూనే ఉంది. దృశ్య మాధ్యమం, ఇంటర్నెట్, ఇంగ్లీష్ మీడియం చదువు - ఇలా కొన్ని కారణాలు పైకి కనిపించినా, ఇవి ఏవీ అసలు కారణాలు కాదు.

ఎందుకంటే, ఇప్పటికీ ఇంగ్లీషు పుస్తకాలు మార్కెట్లో బాగానే అమ్ముడవుతున్నాయి. తెలుగులో అలాంటి వాతావరణం లేదు. కాస్త ఆలోచించాక అర్ధమైందేంటంటే, మన తెలుగులో సాహిత్యానికి పరిచయం చేసే ఎంట్రీపాయింట్ ఎక్కడో తెగిపోయింది. పాలో కొయిలో, డాన్ బ్రౌన్ లాగా అటు కమర్షియల్‌గా హిట్ అయి ఇటు పాఠకుల జనాభాను పెంచే సాహిత్యం తెలుగులో రాకపోవడమే అందుకు కారణం అనిపించింది.

ఇదివరకటి రోజుల్లోలా మనకు ఇప్పుడు పాపులర్ రచనలు లేవు. యండమూరి, యద్ధనపూడిలాగా సాహిత్యం నుంచి సినిమా వరకు రచయితలు పెద్దగా చేరలేకపోతున్నారు. రాజకీయ, సైద్ధాంతిక కథలు మొదలవడం బావున్నా, సాహిత్యానికి బాగా గాంభీర్యం పెరిగి యువత కాస్త బెదురుగా చూసే సమయం ఇది. వారికి కాస్త ధైర్యం ఇద్దామనే ఆలోచనతోనే ఈ పుస్తకాన్ని ముందుకు తెస్తున్నాం.

మరి అందరినీ అలరించి, చదివించే కథాంశం ఏమిటి అని ఆలోచిస్తే ‘ప్రేమ' అని తేలింది. అది మనకి సినిమాలు చూస్తే బాగా అర్థమవుతుంది. రొమాంటిక్ కామెడీలే కాకుండా సమాజంలోని వివిధ నేపథ్యాలను కూడా ప్రేమకథలుగా చెప్పొచ్చనడానికి ఉదాహరణలు సినిమాల్లో చాలానే ఉన్నాయి. ఈ మధ్యనే వచ్చిన 'పరియేరుమ్ పెరుమాళ్' మంచి ఉదాహరణ. మనజీవితాన్ని నడిపించేది ప్రేమే. అసలు ప్రేమించి ఎంతకాలమైంది? ప్రేమను ఆస్వాదించి ఎంత కాలమైంది? ప్రేమను ప్రేమగా చదివి ఎంతకాలమైంది? అందుకే మేము కూడా ప్రేమకథల సంకలనం తీసుకురావాలనే ఆలోచనకి వచ్చాం.

- అపర్ణ తోట
వెంకట్ శిద్దారెడ్డి

***

ఒక సమయంలో ఒకే రచయిత కథలు పది చదవడం కంటే పదిమంది రచయితల కథలు ఒక్కొక్కటి చదవడంలో మనసుకి ఏదో సౌలభ్యం ఉంటుందనిపిస్తుంది. బహుశా అందుకే అన్ని భాషలలోనూ కథా సంకలనాలు ఎన్నో వెలువడ్డాయి. ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. అలా మన తెలుగులో కూడా ఇప్పటి వరకూ ఎన్నో కథా సంకలనాలు వచ్చాయి. అయితే ఈ కథా సంకలనానికో ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఈ సంకలనం సంపాదకుల ఉద్దేశ్యంలో ఉంది. అది... పాఠకులకు ఓ కొత్తదనాన్ని చూపిస్తూ, ఆహ్లాదం కలిగిస్తూ పఠనాసక్తిని పెంచడం. ఈ తరం పాఠకులకు కథకులకు మధ్య ఒక వారధి నిర్మించడం. వారి ఆ ఆలోచన నుండి పుట్టినదే పన్నెండుమంది కథకులు రాసిన ఈ 12 ప్రేమ కథల సంపుటి. ఇవన్నీ ప్యూర్ లవ్ స్టోరీస్..."ఇన్ ది మూడ్ ఫర్ లవ్" స్టోరీస్.

- ఇ-బుక్ పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at In The Mood For Love
Comment(s) ...

'ఇన్ ది మూడ్ ఫర్ లవ్' పుస్తక పరిచయం
http://sanchika.com/in-the-mood-for-love-book-intro/