-
-
ఇలియాడ్
Iliad
Author: Dr. Lanka Siva Rama Prasad
Publisher: Dr. Lanka Siva Rama Prasad
Pages: 276Language: Telugu
ఎన్నో సంవత్సరాలుగా నాలో నిబిడీకృతమై ఉన్న ఆలోచన ఈ విధంగా గ్రంథరూపాన్ని దాల్చింది. వేదవేదాంగాల్ని అధ్యయనం చేస్తూ భగవత్ మూల స్వరూపాన్ని తెలుసుకుందామన్న జిజ్ఞాస ఆత్మానుభూతికి సంబంధించినది కాగా, దేవతల పుట్టుకపై వివిధ ప్రాంతాలలో ఉన్న నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, దేవుడు ఈ సమస్త చరాచర సృష్టిని సృజించాడా లేక కాలపరిణామం ఈ సృష్టికి కారణభూతమై ఎల్టోనియన్ పిరమిడ్ అగ్రభాగాన ఉన్న మానవుడు దేవుడిని తన అవసరార్థం రూపొందించుకున్నాడా అనే భౌతిక తార్కిక దృష్టి నేను పాశ్చాత్య, ప్రాచ్య వాజ్ఞయాలను నిశితంగా పరిశీలించడానికి పురికొల్పింది. కాలాన్ని కొలవడానికి వేద వాఙ్మయం ఉపయోగించిన కాలరేఖ, పాశ్చాత్యులు వినియోగిస్తున్న కాలరేఖతో పొంతనకు రాకపోవడం గమనార్హం.
పాశ్చాత్య వాఙ్మయానికి తలమానికాలైన ఇలియాడ్, ఒడెస్సీ గ్రంథాలను, వాటిని ఇముడ్చుకున్న గ్రీకు ఇతిహాస చక్రాన్ని (ఎపిక్ సైకిల్) విశ్లేషిస్తున్నపుడు క్రీస్తుపూర్వం 13-14 శతాబ్దాల నాటికే ప్రాచీన గ్రీకులకు ఇండియన్లకు మధ్య రాకపోకలుండేవని అర్థమవుతున్నది. ట్రోజన్ల నాయకుడు హెక్టార్ మహావీరుడు ఎఖిల్లిస్ చేతిలో మరణించాక ఇథియోపియన్ల నాయకుడు మెమ్నాన్ తన సైన్యంలో ఉన్న ఇండియన్ సైనికులతో ఎఖిల్లిస్ నాయకత్వాన ఉన్న ఆర్గీవులపై తలపడతాడు కాని దేవతలకు మానవులకు తండ్రిగా పూజించబడే జ్యూస్ దేవేంద్రుడు (ద్యూస్ పితరుడు-ఋగ్వేదం) ఎఖిల్లిస్పై మొగ్గు చూపించడంతో ఎఖిల్లిస్ చేతిలో మెమ్నాన్ వీరమరణం పొందుతాడు.
ఇథియోపియా, ఈజిప్టు, ఏథెన్స్ లాంటి దేశాలతో ఇండియాకున్న సంబంధ బాంధవ్యాలను ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
ఇలియాడ్, ఒడెస్సీ, ఇతిహాస చక్రాల్ని తేనెలూరు తెలుగుభాషలో అందిచాలన్న నా సంకల్పం ఇలా నెరవేరుతున్నది. చరిత్రను అధ్యయనం చేసే కుతూహలం ఉన్న ప్రతి వారికి ఈ గ్రంథావళి ఉపయుక్తమవుతుందని సృజనలోకం భావిస్తున్నది.
- డా. లంకా శివరామప్రసాద్

- ₹540
- ₹324
- ₹270
- ₹216
- ₹270
- ₹324
- ₹540
- ₹324
- ₹270
- ₹216
- ₹270
- ₹324