• Idi Suparipalana 51 Nelala KCR Prabhutvam
  • fb
  • Share on Google+
  • Pin it!
 • ఇదీ సుపరిపాలన : 51 నెలల కె.సి.ఆర్ ప్రభుత్వం

  Idi Suparipalana 51 Nelala KCR Prabhutvam

  Publisher: J.V.Publications

  Pages: 440
  Language: Telugu
  Rating
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  '1/5' From 2 votes.
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  1 Star Rating: Recommended
  '1/5' From 1 premium votes.
Description

నిన్న జరిగిన వాస్తవాలు ఈ రోజు చరిత్ర అవుతుంది. చరిత్ర ఎవరో సృష్టించింది కాదు. మానవ వ్యక్తిత్వ వికాసమే చరిత్ర గమనానికి మూలం. చరిత్రను ఎవ్వరూ సృష్టించరు. మానవ సామాజిక జీవనంలో జరిగిన పరివర్తనలే చరిత్ర.

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రిక సంపాదకుడుగా ఒక ప్రత్యేక సంచిక వేయ సంకల్పించారు. అందులో ఎవరు రాయాలన్న చర్చ వచ్చినప్పుడు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మేధావి ఒకరు, తెలంగాణలో కవులు శూన్యం అన్నారు. దీనికి ప్రతి సవాలుగా, తెలంగాణలోని కవులందర్నీ మేల్కొల్పి “గోలకొండ కవుల సంచిక" గా ప్రచురించారు. ఇది చరిత్రలో ఒక భాగం. వర్తమాన, నడుస్తున్న, చరిత్రను పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు వ్యాసాలు రాసి ప్రజలను మేల్కొలిపేవారు మన దేశంలో అంతగాలేరు. స్వాతంత్ర్యం వచ్చాక ఏ నాయకుడు కూడా స్వీయ జీవిత చరిత్ర రాయలేదు.

జ్వాలా ఒక జ్వాలే. నిరంతరం జ్వలించటం జ్వాలాకు గల ఒక ప్రత్యేక లక్షణం. ఒకరు రాయమంటే రాసేవాడు కాదు. నడుస్తున్న చరిత్రను పరిశీలించి, పరిశోధించి, విశ్లేషణాత్మకంగా ప్రజల ముందుంచడానికి చేసిన ప్రయత్నమే ఈ పుస్తకం.

మన ముందు ఉన్న ఈ పుస్తకం ఒక విధంగా నూతన ఒరవడిని సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన వారానికి ప్రారంభమైన జ్వాలా వ్యాసాలు నాలుగు సంవత్సరాల మూడు నెలల పాటు వివిధ విషయాలపై కొనసాగాయి. ఆ వ్యాసాల సంపుటమే ఈ పుస్తకం. ఇందులో చాలా వ్యాసాలు వున్నాయి. వీటిలో రెండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారివి. ఒకటి-రెండు సేకరించినవి. కాగా, మిగిలినవన్నీ జ్వాలా వివిధ సందర్భాలలో, వివిధ దిన పత్రికలలో ప్రచురించిన వ్యాస సంకలనం. ఇవన్నీ ఇదివరకే వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరాయి. ఇందులో కొన్ని ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినవి. మిగతావి రాజకీయ నేపధ్యంలో, పరిపాలనా విషయ నేపధ్యంలో రాసిన విశ్లేషణాత్మక, విమర్శనాత్మక రచనలు. సమకాలీన రాజకీయ సామాజిక రంగంలో రాష్ట్రం ఎదుర్కొన్న సవాళ్లకు సమాధానంగా, విమర్శతో పాటూ విశ్లేషణ జోడించి, ఆచరించాల్సిన దృక్పథం గురించి రాశారు. ఇవన్నీ ఒక విధంగా భవిష్యత్తులో చరిత్ర అవగాహన చేసుకోవటానికి ఉపకరిస్తాయి. విషయం ఆధారిత వ్యాసాలుగా కాక 51 నెలల్లో జ్వాలా స్పందించిన విషయాల దొంతర ఇది. అందువల్ల పుస్తకం చదవటం మొదలెడ్తే, నడుస్తున్న చరిత్రను మనం ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా వుంటుంది. ఇది ఒక నూతన ఒరవడి. చరిత్రను విశ్లేషించే వారున్నారు. చరిత్రను గ్రంథస్థం చేసే వారున్నారు. జ్వాలా ఎంచుకున్న మార్గం విమర్శ, విశ్లేషణ, వివరణ, విషయ పరిశీలనకు అతి దగ్గరగా ఉంది.

వ్యాసాల రచనలో ఎక్కడా స్కోత్కర్ష ప్రసక్తి లేదు. స్తుతి శూన్యం. మనం చూస్తున్న విషయాలను యధాతథంగా తన శైలిలో పొందుపరిచారు. ఇందుకు అభినందనీయుడే.

- ఆచార్య మారంరాజు సత్యనారాయణ రావు

Preview download free pdf of this Telugu book is available at Idi Suparipalana 51 Nelala KCR Prabhutvam