-
-
ఇది కదంబం
Idi Kadambam
Author: Dasari Amarendra
Publisher: Alambana Prachuranalu
Pages: 194Language: Telugu
‘‘నేను ‘యజ్ఞం’లో వివరించిన కథాస్థలమిది. పంచాయితీ జరిగిన మండపం ఇది. జనం కూడిన ఖాళీస్థలం అదిగో, ఇంకా ఖాళీస్థలంగానే ఉంది....’’ ఊహించని వివరం అందించారు కారాగారు. ఒళ్లు జలదరించింది.
మండపంలో కూర్చున్న శ్రీరాములు నాయడు, కుడి ఎడమ లక్షుంనాయుడు, సూర్యంగారు, కొందరటూ కొందరిటూ పంచాయితీ సభ్యులూ, మునసబు కరణాలూ, మండపం మెట్ల దిగువున అప్పల్రాముడు, అతనికి దగ్గర్లో బంధుబలగం, వాళ్ళందరికీ వెనగ్గా సీతారావుడు, వాళ్ళింటి ఆడంగులు. మండపంలో గోపన్న, మండపం మెట్లమీదా ముందు అరుగు మీదా చూరు పంచ నీడల్లోనూ కూర్చున్న మిగతా ఊరి జనం - ఒక్కసారిగా కాలం యాభై ఏళ్ళు వెనక్కి నడిచి వాళ్ళంతా సజీవంగా కళ్ళ ముందు నిలిచినట్టు అనిపించింది. గగుర్పాటు!
‘‘యజ్ఞం కథకు ఈ ఊరి పరిణామాలే నాకు ప్రేరణ. ఈ ఊరే దానికి భూమిక. ఊరి మొగలో ఓ రెండంతస్తుల మేడ చూపించాను గదా, అలాంటిదే శ్రీరాములు నాయుడు గారి నివాసం. ఆయన ఊహాపాత్ర గాదు. అసలు ఏవీ ఊహాజనితాలు గాదు. అన్నీ నాకు తెలిసిన వివరాలే.’’
ఏమననూ? ఏమనుకోనూ? అది సంతోషమా? ఓ చారిత్రక స్థలాన్ని కళ్ళారా చూసిన సంతృప్తా? కాదా? కానే కాదు. యజ్ఞం నేపథ్యం సంతోషాలకూ, సంతృప్తుకూ వేదిక కాలేదు. అలా అని విషాదమా? చెప్పలేం, వివరించలేం. వర్ణించడం అసలే సాధ్యంగాదు....
- పసితనపు కారాగారితో...
గమనిక: " ఇది కదంబం " ఈబుక్ సైజు 6mb
