• Ide Dharmama
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఇదే ధర్మమా?

    Ide Dharmama

    Publisher: Ganti Prachuranalu

    Pages: 140
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తక్కువ నిడివితో ఎక్కువ స్పాన్‌తో రాసిన ప్రతీకథ పాఠకునికి ఆకర్షించే విధంగా వున్నాయి. రచయిత్రి ప్రధానంగా మధ్యతరగతి పాత్రలతో, వారి ఆలోచనలు, దృక్పథాలతో మలచిన పాత్రలన్నీ చదువరులకి ఎంతో చేరువగా ఉన్నాయి.

- మల్లాది వెంకట కృష్ణమూర్తి

* * *

కథల ముగింపులో ఒక ఆశావహ దృక్పథమో, జీవితంపట్ల ఒక అవగాహనో, ఒక సమన్వయ లక్షణమో కనిపిస్తుంది. అందులోనే రచయిత్రి తన ప్రధానపాత్రలో పరిణత మనస్తత్వాన్ని ప్రదర్శించడం కనిపిస్తుంది. వైవిధ్యపూరితమైన, ప్రయోజనాత్మమైన కథలతో, వివేచనా పూరితమైన సంభాషణలతో, వ్యాఖ్యలతో సంపన్నమైన సంపుటి ఇది.

- అబ్బూరి ఛాయాదేవి

* * *

స్త్రీల వ్యధల్ని హృద్యమైన కథలుగా మలచడంతోబాతు, ఓడిపోయాననుకునే నాయకపాత్రలని గెలుపువేపు నడిపించి స్ఫూర్తిని అందించడం ద్వారా, గంటి భానుమతిగారు ప్రతి ఇంటి బహుమతి.

- కొమ్మనాపల్లి గణపతిరావు

* * *

స్వార్థంతో, అసమానతల ఈక్వేషన్స్‌తో నడుస్తున్న నేటి సమాజంలోని కుళ్ళును కడిగేయాలనుకున్న ఈ రచయిత్రి తాపత్రయం, ఆవేశం, ఆందోళనా ప్రశంసనీయం.

- శారదా అశోక్‌ వర్థన్

* * *

కథచెప్పేతీరూ, విధానం, శైలీ కథలకి అందాలని తొడిగాయి. సువాసనలని పులిమాయి. పైగా వస్తువైవిధ్యం కథలని అలంకరించింది. వస్తువు వివిధ రీతుల్లో ఉండడం వల్ల పాత్రలూ, వాతావరణమూ, (కథకు సంబంధించినది). భాషా, కొత్త అందాలతో అలరించాయి. ఒక చక్కటి కథల సంపుటి చదివాఁమన్న తృప్తి, హయి కలుగుతాయి. భానుమతీ కథల పుస్తకంలో భావం, భాషా పోటీ పడుతూ కథలని పరుగెట్టిస్తాయి.

- అరుణావ్యాస్

Preview download free pdf of this Telugu book is available at Ide Dharmama