-
-
ఐ.సి.సి.యు.
ICCU
Author: Chittarvu Madhu
Publisher: Self Published on Kinige
Language: Telugu
మహానగరంలో ఓ హైటెక్ కార్పొరేట్ హాస్పిటల్!
24 గంటలూ గుండె జబ్బుల చికిత్స చేసే ఐ.సి.సి.యు అంటే ఇంటెన్సివ్ కొరొనరీ కేర్ యూనిట్!
... కొత్తగా డ్యూటీలో చేరిన డాక్టర్ రవికాంత్‌కి అన్నీ అనుమానాలే! సందేహాలే....!
హై బీ.పీ. కోసం చికిత్స తీసుకుంటున్న రోగులు ఒక్కొక్కరే కాంప్లికేషన్స్తో ఐసిసియులో చేరి చివరికి 'కార్డియాక్ ఎరెస్ట్'తో మరణిస్తున్నారు!
కొత్తగా వాళ్ళందరూ వాడుతున్న మందు ఒక్కటే.... ఆర్-4.
... అసలేం జరుగుతోంది ఈ ఐసిసియులో? ...
పరిశోధన మొదలుపెట్టిన డాక్టర్ రవికి తాను చివరికి ఒక భయంకరమైన పద్మవ్యూహంలో, ప్రాణాపాయంలో చిక్కుకుంటాడనీ బయటకు రాలేడనీ తెలియలేదు...
... ఆర్ 4 + ఫేస్మేకర్ + ఎలక్ట్రానిక్స్ + ??? దేశానికి కాబోయే ప్రధానమంత్రిని కూడా తన చెప్పుచేతుల్లో చిక్కించుకోనున్న వైద్య భస్మాసురుడు... ఎవరు?
అడుగడుగునా సస్పెన్స్‌తో డాక్టర్ చిత్తర్వు మధు వ్రాసిన - 1992లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడిన - నవల!...
...తెలుగు నవలా జగత్తులో అపూర్వమైన వైద్యవిజ్ఞాన విస్ఫోటనంగా వర్ణించబడి పాఠకుల మన్నన పొందిన నవల!
అడుగడుగునా గుండెల్లో మెదడులో ఎలక్ట్రానిక్ భీభత్సం సృష్టించే అద్భుతమైన థ్రిల్లర్!
అవధరించండి!
ICCU was written as a medical thriller set in an intensive coronary unit treating heart diseases .It is the first of its kind in Telugu language... a cardiogy based medical thriller.Later I wrote two sequels to this Bye Bye Polonia and Epedemic...Must read science thrillers...
-- Author.
( చాలా మంచి సంపాదకులు సహృదయులు వాకాటి పాండురంగారావు గారి ని స్మరించుకుంటూ...) ఆంద్ర ప్రభ లో ఈ నవల 1990 లో ప్రచురించ బడింది..తెలుగు లో సైంటిఫిక్ నవలలలో పేరు తెచ్చుకుంది ... from my blog madhubhaashini