• Humourology 3
  • Ebook Hide Help
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హ్యూమరాలజీ - 3

    Humourology 3

    Author:

    Pages: 240
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆ రోజు నుంచీ రంగారెడ్డి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. పొద్దున్నే కాలనీలోకొచ్చిన కూరగాయల బండివాడిని ఆపేశాడు.

“టమాటో ఎంత కిలో?” అడిగాడు రెడ్డి.

“మూడ్రూపాయల్సార్”

“ఏం రాజయ్య నేను ఎల్లుండి విమానంలో మద్రాస్ వెళుతున్నాననా ఏమిటి, ధరలు కూడా ఆకాశాన్నంటించేస్తున్నావ్! నేను వెళ్ళేది ఒక్క రోజేనయ్యా బాబు! ఆ సినిమా స్టార్ విద్యతో డిన్నర్ అవగానే మళ్ళా గంటలో హైదరాబాద్ చేరుకోనూ? సినిమా స్టార్‌తో డిన్నర్ తీసుకుంటే నాకేం కొమ్ములొస్తాయా ఏమన్నానా? నువ్ టమాటో మూడు రూపాయలు చెప్తే ఎలా?”

“ఏంటి సార్? ఎల్లుండి విమానంలో మద్రాస్ వెళుతున్నారా?” ఆశ్చర్యంగా అడిగాడు రాజయ్య.

“తప్పేట్లు లేదు? ఆ భారత్ బ్రాంది కంపెనీ వాళ్ళు మొండి బలవంతం చేస్తున్నారు. నాకేమో ఇక్కడ ఆఫీసులో చచ్చేంత వర్క్ వుంది. సెలవు ఇస్తారో ఇవ్వరో తెలీదు. వెళ్ళకపోతే ఆ భారత్ బ్రాందీ వాళ్ళూ, ఆ సినీ స్టార్ ఏమనుకుంటారోనని మళ్ళీ అదొకటి! పోనిలేగదాని ఆహ్వానిస్తే వీడికింత టెక్కా అనుకోరూ! మన గొడవలు వాళ్ళకేం తెలుస్తాయ్!”

Preview download free pdf of this Telugu book is available at Humourology 3