-
-
హ్యూమరాలజీ - 2
Humourology 2
Author: Yarramsetti Sai
Publisher: Indradhanassu Publications
Pages: 320Language: Telugu
“అమెరికా ప్రభుత్వం వాళ్ళు మిమల్ని ఇన్వైట్ చేశారా?”
“అవును”
“ఇన్ని కోట్లమంది భారతీయులుండగా మిమ్మల్నే ఎలా పిలిచారు?”
“అదంతా ట్రేడ్ సీక్రెట్!”
అందరం అతని చుట్టూ మూగిపోయాం.
“బాబ్బాబు? ఆ ట్రేడ్ సీక్రెట్ ఏమిటో చెప్పవూ?” శాయిరామ్ అడిగాడు.
“ఇంకెవరికీ చెప్పనని మాట ఇస్తే చెప్తాను”
అందరం పట్టు వేసుకున్నాం
“మరేం లేదు!ఆ అమెరికన్ కల్చురల్ ఎక్సేంజ్ సెంటర్లోఓ రచయిత్రి ఉంది. ఆవిడ నవల నా పత్రికలో వేసుకుంటే నన్ను అమెరికా పంపిస్తానంది. అంతే!”
“మరి నీకు పత్రిక ఎక్కడుంది?” అదిరి పడుతూ అడిగాడు జనార్ధన్.
“ఈ నెల నుండే ఓ పత్రిక పెట్టాను. ఎన్నిలే వెయ్యి కాపీలు అచ్చు వేయించాను.రచయిత్రికి 25 కాపీలు పంపించేసి మిగతావి చెత్త కాగితాల షాపులో అమ్మించేస్తే సరి. ప్రాబ్లెమ్ తీరిపోతుంది. వస్తా ఫ్లైట్ కి టైమ్ అయ్యింది.” అంటూ వెళ్ళిపోయాడతను. మేము చాలావరకూ సామాజిక కోమాలో ఉండిపోయాం.
