• Hrudaya Sugandham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హృదయ సుగంధం

    Hrudaya Sugandham

    Publisher: Surya Prachuranalu

    Pages: 110
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘‘ఏం తేరుకుంటుందో ఏమో! నాకేం అర్థం కావడం లేదమ్మా! అనుక్షణం వాడి జ్ఞాపకాలతోనే కొట్టుమిట్టాడుతుంటుంది. ఆ విధాత మాకీ వయస్సులో ఎందుకీ దుఃఖాన్ని కష్టాన్ని కల్గించాడో?’’ బరువుగా నిట్టూరుస్తూ బాధాతప్త స్వరంతో అంటున్న ఆయన కళ్లల్లో నీళ్లు నిండాయి.

‘‘కష్టాలనేవి మూడు రకాలుగా మనుష్యులకు కల్గుతుంటాయని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు బాబాయ్‌! మొదటి రకం కష్టాలు మనిషి చేసుకున్న స్వయంకృత అపరాధాలు! అంటే మనంతట మనమే కొని తెచ్చుకునేవి. ఇక రెండోరకం కష్టాలు పరాకృత అపరాధాలు! అంటే....ఇవి సమాజంలో మన చుట్టూ ఉన్న ఇతరుల నుంచి మనకు కలిగేవన్నమాట. ముచ్చటగా మూడోరకం కష్టాలు... మనిషి యొక్క గత జన్మకు చెందిన అవశేషాలని అంటారు. అంటే కర్మఫలాలు. ఇప్పుడు మీకు వచ్చినది రెండో రకానికి చెందినది. కష్టాలనేవి తెప్పించే దుఃఖం కనురెప్ప మాటున ఉప్పెనలా ఆగిపోవాలేగాని, ఆ కన్నీళ్ళనే దుఃఖ సముద్రంగా మార్చుకోగూడదు. లేనిచో దుఃఖపూరితమైన ఆ ఆలోచనల వలన మనిషి జీవితం ఆ కడలి కెరటాల సుడిగుండాల్లో కొట్టుకెళ్లే ప్రమాదముంది బాబాయ్‌! పిన్నిని అలా ఒంటరిగా వదిలేయకుండా అప్పుడప్పుడు మా ఇంటికి తీసుకొస్తుండండి... పిల్లలతో కాస్త గడుపుతుంటే మనస్సు కుదుటపడుతుంది.

‘‘చాలా బాగా చెప్పావమ్మా. ఉత్తమగుణ మాధుర్యాలుగల సమున్నతమైన భావ సంపద నీలో మెండుగా ఉంది. నీవు దాన్ని వెలికి తీసి కాగితంపై పెట్టగూడదమ్మా?’’

‘‘అయ్యబాబోయ్‌! మీరు మరీను. నాపట్ల చాలా అతిశయోక్తిగా మాట్లాడుతున్నారు బాబాయ్‌! రచనా వ్యాసంగం చేసేంతటి ప్రతిభా పాటవాలు నాలో లేవు లెండి. ఏదో నేను చదివినవి...విన్నవి మంచి మాటలిలా చెప్తుంటానంతే...’’

Preview download free pdf of this Telugu book is available at Hrudaya Sugandham