-
-
హిట్‌లిస్ట్
HitList
Author: Manjari
Publisher: Sagar Publications
Pages: 200Language: Telugu
``నీకు సహాయం చెయ్యమని లెఫ్టనెంట్ ఉత్తరంలో రాశాడు. అంతదూరం నుంచి వచ్చావంటే నీ పని ముఖ్యమయినది అయి వుంటుంది” సాలోచనగా అని జోగీందర్ సింగ్ మొహంలోకి చూశాడు.
``అవును” అని ఓ క్షణం తరువాత స్థిరంగా చెప్పాడు, ``చాలా ముఖ్యమయినది.”
కమాండర్ సిగరెట్ వెలిగించుకున్నాడు.
``ఆ పని ఏమిటి?” అడిగాడు.
``మీ దగ్గర ట్రయినింగ్ పొందిన ఓ మనిషి నాకు కావాలి” చెప్పాడు.
``ఎందుకు?”
``నా శత్రువుని చంపడానికి?”
``ఎవరా శత్రువు?” ఆశ్చర్యంగా అడిగాడు. చాలా సంవత్సరాల నుండి ట్రయినింగ్ క్యాంప్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. యువకులకు ట్రయినింగ్ ఇవ్వడంతో అతని బాధ్యత పూర్తవుతుంది. ప్రొఫెషనల్ కిల్లర్స్‌ని అక్కడ తయారుచెయ్యరు. ఆ విషయం ఆ వృద్ధునికి తెలియదేమోననే అనుమానం వచ్చింది. అంతలోనే అతన్ని లెఫ్ట్‌నెంట్ పంపాడనే విషయం గుర్తొచ్చింది.
``నా శత్రువు పేరు శ్రీనివాసన్. పంజాబ్ మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్. ప్రస్తుతం అతను ఢిల్లీలో నివసిస్తున్నాడు.”

- ₹108
- ₹140.4
- ₹108
- ₹86.4
- ₹129.6
- ₹108