-
-
History and Culture of Kalinga-Andhra
History and Culture of Kalinga Andhra
Author: Dusi Dharmarao
Publisher: INTACH -Srikakulam District Chapter
Pages: 156Language: English, Telugu
This book is a compilation of research papers submitted in the Two Day National Seminar on History and Culture of Kalinga Andhra with a focus on Srikakulam.
ప్రాచీన కళింగదేశంలో కొంతభాగమే నేటి శ్రీకాకుళం జిల్లా. ఒడిషాలోని మహానది ఆంధ్ర ప్రాంతంలోని గోదావరి నదుల మధ్య విస్తరించిన తీర ప్రాంతమే కళింగదేశంగా పిలవబడేది. ఈ ప్రాంతం చారిత్రకంగా ప్రాచీనమైనది. సాంస్కృతికంగా వైభవోపేతమైనది.
క్రీ.పూ. నాటికే దంతపురం, శాలిహుండం, జగతిమెట్ట కళింగపట్టణం వంటి ప్రాంతాలు ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలుగా ప్రసిద్ధమైనవి. కళింగదేశ రాజధానిగా దంతపురి, శ్రీముఖలింగం ప్రఖ్యాతమయ్యాయి. ఈ ప్రాంతాన్ని వెయ్యి సంవత్సరాలకు పైగా తూర్పు గాంగులు లేక కళింగ గాంగులు పేరుగల రాజులు పరిపాలించి, సాంస్కృతికంగా అభివృద్ధి చేసారు. శ్రీముఖలింగం శ్రీకూర్మం, అరసవల్లి, మెళియాపుట్టి, గుళ్ల సీతారాంపురం, మహేంద్రగిరి, సైలాడ, పాండవులమెట్ట వంటి ప్రదేశాలు సంస్కృతీ కేంద్రాలుగా ప్రసిద్ధమయ్యాయి. ఇంకా ఎంతో పరిశోధన జరగవలసి ఉంది.
తొలిసారిగా కళింగాంధ్ర చరిత్ర సదస్సులు శ్రీకాకుళం జిల్లా చరిత్రపై ప్రాధాన్యతతో నిర్వహించారు. వివిధ విశ్వవిద్యాలయాలలో ఇప్పటికే ఈ ప్రాంత చరిత్రపై కొందరు ఆచార్యులు పరిశోధనలు జరిపించారు. ఇంతవరకు జరుగుతున్న చరిత్ర పరిశోధన కృషికి కొనసాగింపుగా తేదీ 17-6-2012, తేదీ 18-6-2012 రెండురోజులూ వివిధ ప్రాంతాలకు చెందిన చరిత్ర పరిశోధకులను శ్రీకాకుళం ఆహ్వానించి తమ పరిశోధన విషయాలను పత్రాల రూపంలో వివరించవలసినదిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. గురజాడ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రాంగణంలో ఈ కళింగాంధ్ర చరిత్ర సదస్సులు నిర్వహించారు.
రెండు రోజులపాటు జరిగిన ఈ చరిత్ర సదస్సులలో ఆర్కియాలజీశాఖలో కృషిచేసి రిటైర్ అయిన పెద్దలు డాక్టర్. జవహర్ లాల్ (తిరుపతి), ఈ ప్రాంతంపై అభిమానంగల డాక్టర్. ఎల్. పాండురంగారావు, ఆచార్య జి.వేంకటరామయ్య, ప్రొ.సి.సోమసుందరం, చెన్నై, ప్రొ.కృష్ణకుమారి వంటి 30 మంది పరిశోధకులు తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. భవిష్యత్తు
తరాలవారికీ పరిశోధకులకు ఈ వివరాలను అందించాలనే ఉద్దేశంతో ఈ పత్రాలన్నిటినీ ఒక పుస్తకంగా రూపొందించడమైనది.
Note: The size of eBook “History and Culture of Kalinga Andhra” is 12.8 mb
I could not download the ebook, but the account shows the amount deducted. Please, tell me how to get the book or amount back