-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
హిరణ్యరాజ్యం (free)
Hiranya Rajyam - free
Author: Vempalli Gangadhar
Pages: 102Language: Telugu
"గతం, వర్తమానాలకు మధ్య నిరంతరం సాగే సంభాషణే చరిత్ర".
పుట్టినచోట ఏ నది అయినా విస్తారంగా వుండదు. ప్రవహిస్తూ తన వేగాన్ని, గతినీ విస్తృతం చేసుకుంటుంది. చరిత్ర కూడ అంతే! నిరంతరం మార్పులకు గురైన సంఘజీవనాన్ని చరిత్ర ప్రతిబింబిస్తుంది.
ఒక పరిణామ క్రమాన్ని చారిత్రాత్మక దృష్టి కోణం నుంచి చరిత్రను 'రికార్డు' చేసి మనకు తెలియని మన చరిత్రను ఆవిష్కరించడం మా ప్రయత్న ఉద్దేశ్యం. ఫ్యాక్షనిజం నిర్మూలనకు మా వంతు బాధ్యతగా చేస్తున్న ఒక అవగాహన ప్రచారం.
ప్రతి ఒక్క జీవి తాను బతికే స్థలానికి, పరిసరానికి అనువుగా మారుతుంది. కానీ ఏదీ స్థిరం కాదు. ఒకప్పుడు మైదానాలు ఉన్నచోట పర్వతాలు సైతం ప్రత్యక్షమౌతాయి. సముద్రాలు ఇంకిపోయి పొడినేల భూమి ద్వారా ఏర్పడుతుంది. అలాగే ఈ నేల మీద కూడా ఫ్యాక్షన్ అంతరించిపోయి, అందరి జీవితాల్లోనూ కాంతిపూల పరిమళాలు పూచే కొత్త జీవితం అవతరించాలనేది మా ఆశ... ఆకాంక్ష.
"దేన్నయినా సృష్టించడానికి యుగాలు పట్టవచ్చు. నాశనం చేయడానికి క్షణాలు చాలు. ఇలా సృష్టికి - విలయానికి మధ్య జరిగే సంభాషణే మానవ చరిత్ర సారం... సారాంశం" అని అంటారు చరిత్రకారుడు బెంజిమన్ ఆర్టోలి. హింస, విధ్వంసంతో మనమేం సాధించగలం? ఘర్షణ... సంఘర్షణ... కక్షలు మనిషి జీవితానికి తీరని శాపాలు. 'హింస' స్థానంలో శాంతి కపోతాలు ఎగరాలనేది మా ఆశయం.
- డా. పి. ఆదర్శరెడ్డి
