-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
హిందూత్వ రాజకీయాలు - సామాజిక మూలాలు (free)
Hindutva Rajakeeyalu Samajika Mulalu - free
Author: Rani Siva Sankara Sarma
Publisher: Bhinna Swaralu
Pages: 56Language: Telugu
చంద్రశేఖర్ వ్యక్తి కాదు. భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ. కేవలం న్యాయవాది మాత్రమే కాదు. అన్యాయంపై దూసిన ఖడ్గం. కులతత్వానికి వెన్నులో వణుకు పుట్టించిన దళితుల కంఠస్వరం. చుండూరు దళితుల పక్షాన కోర్టులో పోరాడి గెలుస్తూ, అర్ధాంతరంగా అస్తమించిన ప్రచండ భానుడు. ఇది చంద్రశేఖర్‌కి వొక పార్శ్వం మాత్రమే.
చంద్రశేఖర్ మరోవైపు మొత్తంగా ఆధునికతనే ప్రశ్నించాడు. ఆధునికతని ప్రశ్నించే క్రమంలో అద్వైత వేదాంతాన్నీ, సనాతన సంస్కృతినీ, సంస్కృత భాషనీ అధ్యయనం చేయడం మొదలు పెట్టాడు. ఈక్రమంలో రాణి శివశంకర శర్మ భావాల పట్ల, 'ది లాస్ట్ బ్రాహ్మిన్' గ్రంథం పట్ల ప్రత్యేక ఆసక్తిని కనబరిచాడు. 'హిందూత్వ’ అనేది ప్రచ్ఛన్న క్రైస్తవం, పూర్తి ఆధునికం అనే అవగాహనకి వచ్చాడు.
“సంస్కర్తలూ, ఆధునిక మేధావులూ ప్రపంచాన్ని తొందరపాటుతో నిరంతర మార్పుకి గురి చెయ్యాలని ప్రయత్నిస్తూ వచ్చారు. అసలు చెయ్యవలసినది ప్రపంచాన్ని సరైన పద్దతిలో వ్యాఖ్యానించడం” అనే అభిప్రాయానికి చంద్రశేఖర్ వచ్చాడు.
'హిందూత్వ' ప్రాపంచిక దృక్పథం గురించి యిప్పటి వరకు వున్న వ్యాఖ్యానాలు అసంపూర్ణమైనవే కాదు, అసంబద్ధమైనవి కూడా. ఇదీ రాణి శివశంకర శర్మ అభిప్రాయం. శర్మ అభిప్రాయాలతో చంద్రశేఖర్‌కి ఏకాభిప్రాయం వుంది.
బుద్దిజం నుండి గాంధీజం దాకా, మార్కిజం నుండి అంబేడ్కరిజందాకా, విప్లవోద్యమాల నుండి అస్థిత్వ ఉద్యమాలదాకా అందరూ ఎవరి పద్ధతుల్లో వాళ్ళు సమాజాన్ని మానవీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. సమాజాన్ని మానవీకరించే కృషి బహుముఖాలుగా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. వీటిలో ఏ ఒక్క ధోరణో సమాజంలోని అన్ని రుగ్మతలను పరిష్కరించగలదని అనుకోవడానికి ఆస్కారం లేదని మా ‘భిన్న స్వరాల' ఏకాభిప్రాయం.
ప్రస్తుతం సమాజాన్ని అమానవీకరించే కృషిని ‘హిందూత్వ’ పెద్దఎత్తున చేస్తుంది. హిందూత్వ' రాజకీయాలపై పలుకోణాలనుంచి విమర్శలున్నాయి. కానీ 'హిందూత్వ' అనేది భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని, భారతీయ సంస్కృతికి, దానికీ ఏ మాత్రం సంబంధం లేదని దాని బీజాలు వలసవాద ఆధునికతలో ఉన్నాయని ఒక కొత్త గొంతుకను రాణి శివశంకర శర్మ వినిపిస్తున్నారు.
- పబ్లిషర్స్
