-
-
హిందూ నాగరికత ప్రాచీనత - వైశిష్ట్యము
Hindu Nagarikata Prachinata Vaisishtyamu
Author: Indrakanti Venkateswarlu
Publisher: Vidyarthi Mitra Prachuranalu
Pages: 208Language: Telugu
అద్భుతమైన మన ప్రాచీన సంస్కృతీ వైశిష్ట్యాన్ని, సభ్యతా వికాసాన్ని మన భావితరాలకు అందించడమే ఈ పుస్తకం ప్రధాన ఉద్దేశ్యం. ఇలాంటి ప్రయత్నంలో ఇది ఆరంభమేమీ కాదు. ఇలాంటి దుస్థితిని వందసంవత్సరాల క్రితమే ద్రష్టలు స్వామివివేకానంద, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మదన్మోహన్ మాలవ్యా, లోకమాన్య బాలగంగాధర తిలక్లాంటి మహనీయులు ఊహించి తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించారు. ఆ తరువాత కూడా దేశం మొత్తంలో పలువురు జాతీయతావాదులు, విద్యావేత్తలు తమవంతు కృషి చేశారు. కొన్ని వందల ప్రభుత్వేతర సంస్థలు-రాష్ట్రీయ స్వయం సేవకసంఘ్,శ్రీరామకృష్ణ మిషన్ లాంటి ప్రపంచస్థాయి సంస్థలనుంచి- స్థానికంగా తమకున్న కొద్దిపాటి వనరుల్లో పనిచేసే చిన్న చిన్న సంస్థల వరకు-తమ పాత్రను నిర్వహిస్తూనే ఉన్నాయి. ఈ పవిత్ర మహాయజ్ఞంలో బాధ్యతగల ప్రతి భారతీయుడూ తనవంతు పాత్ర నిర్వహించి తీరాలి. హిందువులు ప్రపంచంలో మరి యేయితర సమాజంకంటే వెనుకబడలేదనీ,వారి నాగరికత ప్రపంచంలోని అన్ని నాగరికతలకంటే పురాతనమనీ,ప్రపంచం మొత్తానికి విజ్ఞానకాంతులు ఇక్కడినుండే ప్రసరించాయనీ చెప్పడం,ఆ విషయాలను రేఖామాత్రంగానైనా నేటి తరానికి తెలియజేయడం ఈ రచన ప్రధానలక్ష్యం.
- ఇంద్రకంటి వేంకటేశ్వర్లు

- ₹60
- ₹64.8
- ₹60
- ₹60
- ₹60
- ₹60