-
-
హిందీ నేర్చుకుందాం రండి! - హిందీ స్కూల్ ఎస్సేస్ అండ్ లెటర్ రైటింగ్
Hindi Nerchukundam Randi Hindi School Essays and Letter Writing
Author: Dr. B. Lakshmaiah Setty
Publisher: Victory Publishers
Pages: 364Language: Telugu, Hindi
ఇది "హిందీ నేర్చుకుందాం రండి!", "హిందీ స్కూల్ ఎస్సేస్ అండ్ లెటర్ రైటింగ్" అనే రెండు చిన్న పుస్తకాలు కలిసిన ఈబుక్.
* * *
డా. బి. లక్ష్మయ్య శెట్టి రచించిన "హిందీ నేర్చుకుందాం రండి! " విద్యార్థులకెంతగానో ఉపయోగకరం. వర్ణమాల పదాల పరిచయంతో ప్రారంబించి, అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, గుణింతాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంఖ్యలు, పదాల నిర్మాణం, పలకని అక్షరాలు, భాషాభాగాలు, హై, హైఁ ప్రయోగం, హూ, హూఁ ప్రయోగం వంటి వాటిని సులువుగా, అందరికీ అర్థమయ్యేలా వివరించారు రచయిత.
నామవాచకాలు, సర్వానామాలు, క్రియలు, కాలలు, క్రియావిశేషణాలు, విశేషణాలు, విభక్తి ప్రత్యయాలు, సంధి పదాలు, లింగ భేదం, వచనములు, వాక్యనిర్మాణం వంటివి ఉదాహరణలో సహా వివరించబడ్డాయి.
* * *
"హిందీ స్కూల్ ఎస్సేస్ అండ్ లెటర్ రైటింగ్" అనే పుస్తకంలో విద్యార్థులకు ఉపయోగపడే 134 చిన్న చిన్న వ్యాసాలు, అవసరమైన చోట తెలుగు పదాల వివరణతో ఇవ్వబడ్డాయి.
- ప్రచురణకర్తలు
