• Hetuvadam Marxism
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హేతువాదం - మార్క్సిజం

    Hetuvadam Marxism

    Publisher: Hema Publications

    Pages: 91
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హేతువాదం-మార్క్సిజం పుస్తకం అచ్చయి పాతిక సంవత్సరాలైంది. ఈ పాతిక సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వాటిలో లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ వంటివి వున్నాయి. అదేవిధంగా కమ్యూనిస్టు రాజ్యాల్లో చాలా మార్పులు సంభవించాయి.

రష్యాలో, చైనాలో మార్క్సిజం ప్రకారం రావలసిన మార్పులు రాకపోగా తద్విరుద్ధమైన మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో మార్క్సిస్టు మేధావులు అవాక్కయ్యారు. కొంతకాలం రష్యాను, మరికొంత కాలం చైనాను ప్రపంచ పీడిత ప్రజల ఆశాజ్యోతులుగా అభివర్ణించిన వారంతా అవి సామ్రాజ్యవాద దేశాలుగా పరిణమించడాన్ని జీర్ణించుకోలేకపోయారు.

యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (USSR) గా వున్న కమ్యూనిస్టు రష్యా 1991లో 15 స్వతంత్ర దేశాలుగా విడిపోయి ముక్కచెక్కలైంది.

భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు ఎత్తుగడల పేరుతో దివాళాకోరు రాజకీయాలకు దిగజారిపోయాయి. అవి రాముడు, కృష్ణుడు వంటి పురాణ పురుషుల్ని, వివేకానందుడు వంటి హిందూమతవాదుల్ని జాతీయ నాయకులుగా గుర్తించి, కీర్తించే దశకు దిగజారాయి. ఓట్ల కోసం, సీట్లకోసం మిగతా రాజకీయ పార్టీలలాగే కులమతాలను సమర్థించే స్థాయికి చేరుకున్నాయి. అయినా వాటికి ప్రజల ఆదరణ దక్కలేదు. అవి క్రమంగా బలహీనపడి కాలగర్భంలో కలిసిపోతున్నట్టు కనిపిస్తుంది.

జాతీయ, అంతర్జాతీయ కమ్యూనిస్టు రంగంలోని ఇటువంటి పరిణామాలను గమనించిన రంగనాయకమ్మగారు వాటిని తీవ్రంగా విమర్శించారు. అయితే ఆ పరిణామాలకు కమ్యూనిస్టు పార్టీల తప్పుడు విధానాలు, ఆచరణే కారణాలని భావించారు. మార్క్సిస్టు సిద్ధాంతం మాత్రం సరియైనదేనంటున్నారు.

కాని, మార్క్సిజం ఆచరణలో విఫలమైందనడం అపోహ మాత్రమే. వాస్తవానికి చరిత్రను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల, ఆ అవగాహనలోపం కారణంగా బయలుదేరిన అపోహే మార్క్సిజం.

- గుమ్మా వీరన్న

Preview download free pdf of this Telugu book is available at Hetuvadam Marxism