-
-
హలో, మిసెస్ చక్రపాణి స్పీకింగ్!
Hellow Mrs Chakrapani Speaking
Author: S.V. Krishna
Language: Telugu
ప్రముఖ ప్రచురణకర్త యస్వీ. కృష్ణ గారి మొదటి కథా సంపుటి ఈ "హలో, మిసెస్ చక్రపాణి స్పీకింగ్!"
ఈ సంపుటిలో రచయిత వింత కొత్తదనాన్ని చొప్పించే ప్రయత్నం చేసారు. తమ కథలను వారు 1. ప్రేమబంధాలు 2. సామాజిక అంశాలు 3. మానవ సంబంధాలు 4. అంతరంగికాలు 5. వ్యంగ్యవైభవాలు.... అని ఐదు విభాగాలుగా విభజించి ప్రచురించారు. ఈ విభజనలోనే రచయిత తమ నేర్పునూ, సామాజిక స్పృహనూ స్పష్టంగా చాటుకోగలిగారు.
ఈ కథలు చదువుతున్నప్పుడు పాఠకుడికి రచయితలోని గొప్ప ప్రేమికుడు కన్పించి హృదయాన్ని పరవశింపజేస్తాడు. గొప్ప ఆరాధకుడు కన్పించి మనసును రంజింపజేస్తాడు. గొప్ప భావుకుడు కన్పించి గుండెను ఉక్కిరిబిక్కిరి చేసేస్తాడు. గొప్ప వివేకి కన్పించి విస్తారమైన ఆలోచనలను రేకెత్తిస్తాడు. అంతేకాక, రచయిత ఆత్మ పలుకోణాలలో ప్రతిఫలిస్తూ కన్పించి, బుద్ధి మీద దార్శనికత్వం సల్పడానికి కూడా ప్రయత్నిస్తుంది. అందుకే ఈ సంపుటి "పంచ రుచుల కథాగుచ్ఛం" కాగలిగింది.
- టి. ఎస్. ఏ. కృష్ణమూర్తి
