-
-
హేలగా... ఆనంద డోలగా...
Helaga Ananda Dolaga
Author: T. Srivalli Radhika
Publisher: Self Published on Kinige
Pages: 152Language: Telugu
.... సున్నితమైన మానవ సంబంధాల చిత్రణ, రసాత్మకత, ఆర్ద్రత ఉన్నా, ఎక్కువగా ఈ సంపుటిలోని కథానికలు భావన పైన ఆధారపడిన (Idea-Based) కథానికలు! ఒకదాని వెనుక ఒకటిగా తరుముకు వచ్చే సంఘటనలు, ఉద్వేగభరితమైన సుధీర్ఘ సంభాషణలు / వర్ణనలూ, ఉద్రిక్తత కలిగించే సన్నివేశాలు - ఇలాటివి అంతగా కనపడవు! కొండలపై నుంచి, “అభంగ తరంగ మృదంగ” ధ్వనులతో దూకే నదీకన్యలా ఉండదు సాధారణంగా వీరి కథానిక! లోతుగా సాగే అంతర్వాహిని సరస్వతిలా ఉంటుంది!! ఎక్కువగా ఉత్తమ పురుషలో సాగుతాయి వీరి కథానికలు. కొన్నిసార్లు, అలా ఎందుకనే ప్రశ్న పాఠకులకి మిగిలిపోయే అవకాశం లేకపోలేదు! అయినా, పదాల ఎన్నికలో, భావవ్యక్తీకరణలో, పాత్రచిత్రణలో, కథాసంవిధానంలో, క్లుప్తతలో, ఆలోచనల స్పష్టతలో, పాఠకులపట్ల ప్రకటితమయ్యే గౌరవంలో, ఇలా అనేక కోణాలలో పాఠకులను విస్మయపరుస్తాయి; అలోచించినకొద్దీ, మరీ అలోచింపచేస్తాయి; రచయిత్రి భావజాలంతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా !!! ఇన్ని చక్కని, చిక్కని కథానికలు పాఠకులకందిస్తున్న శ్రీవల్లీ రాధిక గారికి శుభాభినందనలు, శుభాకాంక్షలు!!
- కుందుర్తి రజనీకాంత్
