-
-
హాస్యామృతం
Hasyamrutham
Author: R.V.Prabhu
Publisher: J.V.Publications
Pages: 121Language: Telugu
నవరసాలలో హాస్యానిది పెద్దపీట. మిగిలిన ఎనిమిది రసాలతో గుండెలు బరువెక్కి పోతే సేదదీర్చి, ఉపశమనాన్ని కలిగించేది హాస్యరసం.
ఏ రసంలోనైనా కొంచెం శ్రమపడి కథలు అల్లవచ్చు. కాని హాస్యకథలు వ్రాయడం చాలా కష్టం. ఇది రచయితలందరూ ఒప్పుకుంటారు. అలాగే ఏ రసాన్నైనా కాస్త శ్రమ పడి అభినయించవచ్చు. కాని హాస్యరసాన్ని పోషించడం అంత సులువు కాదు.
ఇక ఈ పుస్తకం 'హాస్యామృతం' విషయానికొస్తే, శ్రీ ఆర్.వి. ప్రభుగారు చాలా నెలలుగా, అవలీలగా అచ్చంగా తెలుగులో చతురోక్తులను వ్రాస్తూ సభ్యులందర్నీ కడుపులుబ్బ నవ్విస్తున్నారు. ప్రభుగారు వ్రాసిన చతురోక్తులు వేటికవే హాస్యరస గుళికలు. ఐనా ప్రభుగారిలో వున్న ప్రతిభా దివాకరుడ్ని చూపించడానికి ఇదుగో ఈ కాగడా చూపిస్తున్నాము.
దూరదర్శనవల్లి తన భర్త డిస్కవరీగాడితో అడవిలోకి వెళ్ళింది.
హఠాత్తుగా ఒక పులి చెట్టుచాటు నుండి ఎదురుగా వచ్చి నిలబడింది.
డిస్కవరీగాడు గబగబా చెట్టు ఎక్కి...
'షూట్ చెయ్యి. తొందరగా షూట్ చెయ్యి' అని అరుస్తూ ఖంగారుపడ్డాడు.
'ఇదిగో మరి. ఖంగారు పడితే ఎలా? బాటరీ మారుస్తున్నాను కెమేరాలో!' అంది దూరదర్శన్వల్లి.
పై చతురోక్తిలో కేవలం హాస్యం మాత్రమే కాదు, మీడియావారి అత్యుత్సాహం మీద ఒక చురక కూడా వుంది.
చతురోక్తులలో వ్యక్తులకు హాస్యరస స్ఫోరకమైన పేర్లు పెట్టడం ప్రభుగారి ప్రత్యేకత!
ఈ చతురోక్తులన్నీ ఒక పుస్తకంగా వెలువడితే ఎంత బాగుండును అని అస్తమాను అనుకుంటూ వుండేవాళ్ళం. మా ఆలోచనకు అనుగుణంగా ఇప్పుడు ఈ పుస్తకం వెలువడుతుండడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తూంది.
- పయ్యేటి శ్రీదేవి, రంగారావు
