-
-
హాస్యకథ - 2010
Hasyakatha 2010
Author: Multiple Authors
Publisher: Srikrishna Publications
Pages: 280Language: Telugu
2010 సంవత్సరంలో వెలువడిన హాస్యకథలను సంకలనంగా అందిస్తున్నారు – వియోగి, ఏ.వి.ఎమ్, టి.ఎస్.ఎ. కృష్ణమూర్తి - శ్రీకృష్ణా పబ్లికేషన్స్ ద్వారా. తెలుగు తల్లికి హాస్యాభిషేకం ఈ సంకలనం.
* * *
నా మొగుడే నయం (ఏవిఎమ్)
రాణి, పూజ అక్కచెల్లెళ్ళు. ఇద్దరూ బెంగుళారులోనే వుంటారు, రాణి భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు, పూజ భర్త సిఏ.
ఓ రోజు పూజ ఏడుస్తూ అక్కరాణి దగ్గరకు వచ్చింది.
''అక్కా మా ఆయనకు విడాకులిస్తా'' అన్నది ఏడ్పుగొంతుతో జీరగా.
''ఏం చేశాడే నా మరిది!'' అనునయిస్తూ అన్నది రాణి.
''ఎప్పుడూ ఆఫీసుపనే, శెలవు రోజు కూడ ఇంట్లో ఆఫీసుఫైళ్ళు ముందేసుకుని అర్ధరాత్రిదాకా వాటితోనే!''
''అంటే.. శెలవు రోజున నీ కళ్ళ ఎదుటనే వున్నట్లేగా!?''
''అవును!''
''ఇంట్లో టి.వి లోనే సిన్మా చూస్తావు గదా!?''
''అవును!''
''రకరకాల కోరికలేం కోరడు! ఏం చేసి పెడితే అదే తింటాడు అవునా!?''
''అంతేమరి! ఓ ప్లాట్ కొన్నాడూ.. ఆ అప్పు తీరేదాకా అన్నీ గప్చిప్ అంటాడు!''
''కదామరి... నీ బావ ఏం చేస్తున్నాడో చెబుతా విను!''
''శనివారం శెలవుగదా! రంజని ఇంట్లో వుంటాడు, ఆదివారం క్లబ్లో వుంటాడు రోజూ సాయంత్రం బార్లో వుంటాడు! ఈ ప్లాట్ అమ్మబోతున్నాం! నాకు అమ్మపెట్టిన నగలన్నీ బ్యాంకులోనే వున్నాయి!''
''అయ్యో! నా మొగుడే నయం'' అంటూ ఇంటికి పరిగెత్తింది పూజ.
''సడెన్గా భలే కథ అల్లి, చెల్లెల్ని దారిలో పెట్టావే!'' అంటూ రాణి భర్త బెడ్రూమ్ తలుపు తీసుకుని వచ్చాడు, అభినందిస్తూ...
''ఎంతైనా రచయిత్రివి గదా!'' అన్నాడు.
- FREE
- FREE
- ₹180
- ₹270
- FREE
- FREE
0 ♥ At 2014-11-02 00:30:17
Report abuse
బాగుంది. కానీ కనీసం కథల రచయితల లిస్ట్ అయినా ఇస్తే బాగుంటుంది. April 2016. (Asking again)
బాగుంది. కానీ కనీసం కథల రచయితల లిస్ట్ అయినా ఇస్తే బాగుంటుంది