-
-
హస్త సాముద్రికం
Hasta Samudrikam
Author: Sri Sarvari
Publisher: Master Yogaashram
Pages: 256Language: Telugu
జ్యోతిషానికి జాతకచక్రం, హస్త సాముద్రికం రెండుకళ్లు.
మనిషిపైన గ్రహాల ప్రభావం ఉండి తీరుతుంది. నమ్మినా, నమ్మకపోయినా పుట్టిన సమయంలో గ్రహాల స్థితిగతుల్ని బట్టి మనిషి జీవితం నడుస్తుంది. గ్రహాల బలాలు మారుతూ ఉంటాయి. మనిషిలో మంచి, చెడూ రెండూ ఉంటాయి. గ్రహాలలో శుభ గ్రహాలు, పాప గ్రహాలు ఉంటాయి. శుభాశుభ ఫలితాలను అంచనా వేయడమే జ్యోతిషం చేసేపని. అరచేతి గీతలు గుర్తులు, గ్రహబలాలకు. ప్రతిబింబాలు పుట్టినప్పుడే విధి నుదుటిపైన కనిపించని రాతలు, అరచేతుల్లో కనిపించే గీతలు రాస్తుంది. కనుక జ్యోతిషం, సాముద్రికం వేరు వేరు కాదు, కవలలు.
జాతకాలపైన నవగ్రహాల ప్రభావం కన్న నెఫ్ట్యూన్, ఫ్లూటో, యూరానస్ గ్రహాల ప్రభావం బాగా పనిచేస్తోంది. ఈ పుస్తకం ఆ ప్రభావాన్ని వెలికితీస్తుంది. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలకు ఈ 'హస్తసాముద్రికం' పెద్దపీట వేసింది. నెప్ట్యూన్ ప్రభావంతో ఆధునిక పోకడలు, జీవన విలాసాలు, వైవిధ్యాలు సంతరించుకున్న పుస్తకం ఇది.
హస్తసాముద్రికం నేటి కాలపు యువతకోసం. ఈ పుస్తకం జ్యోతిషం వృత్తిగా చేసుకునే వారికి బాగా పనికొస్తుంది. సాముద్రికం నేర్చుకోదలచిన వారికిది సాముద్రిక సర్వస్వం. ఈ ఒక్కటి చాలు వృత్తి పరంగా బంగారు బాటలు వేసుకోడనికి. అన్ని అనుమానాలు నివృత్తి చేస్తుంది. సరదాగా సాముద్రికం నేర్వదలచిన వారికి, స్నేహ వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో ఉపకరిస్తుంది. మీ చుట్టూ వారితో పరిచయం స్నేహంగా మారడానికి పనికొస్తుంది. ఇంకా అనేకానేక అవసరాలకు చక్కని చిట్కా పామిస్ట్రీ. మంచి వారనిపించుకోడనికి, మంచిని పెంచడానికి, ఇన్ని మాటలెందుకు. మీరూ పామిస్టు అవండి. ఎన్ని లాభాలో మీకే తెలుస్తాయి.
- శార్వరి
hello sir how can i opened it
This book is good to read, but it will be good to add some more brief information and images
Sar iwant you r hasta sanudrikam book