-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
హరినే అడగరో ఆమాట (free)
Harine adagaro Aamata - free
Publisher: Self Published on Kinige
Pages: 280Language: Telugu
Description
ఇపుడు మీ చేతిలోవున్న ఈ ''హరినే అడుగరో ఆమాట – 4సంపుటాలు'' లో అన్నమయ్య భక్తి వైరాగ్య శృంగారకీర్తనలను ఉపోద్ఘాత రహితంగా భావమును దర్పణంలో చూపినట్లు వివరించాలని ప్రయత్నించాను. ఇవన్నీ దాదాపుగా అనాఘ్రాత పుష్పాలు. పండితులు కించిత్ దోషమును ఈ దర్పణంలో పొడగనినా సహృదయంతో మన్నిస్తారని ఆశిస్తాను. నిష్ణాతులే అన్నమయ్య అసలు భావం కనిపెట్టలేక కళ్ళు తేలవేసే సందర్భాలను ఈ సాహిత్యంతో పరిచయమున్న వారెరుగుదురు. ఇక నేనెంత చెప్పండి.
మనల్ని పుట్టించి, రక్షించి, శిక్షించి చివరకు భక్షించేది కూడా పరమాత్మయే. పేరేదైనా ఆడ అయినా మగయైునా, జాతి మతముయేదైనా పరమాత్మ ఒక్కడే. మంచి ఆలోచన, మంచిమాట, మంచి నడవడి ఇవే ఆయన మననుంచి కోరుకునేది. ''డబ్బు'' కావలసింది మనకి ఆ సర్వేశ్వరునకు కాదు. ఆ పరమాత్మకే దీనిని అంకితమిస్తున్నాను.
- రచయిత
Login to add a comment
Subscribe to latest comments

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE