-
-
హరిజన శతకము
Harijana Satakamu
Author: Kusuma Dharmanna Kavi
Publisher: Hyderabad Book Trust
Pages: 59Language: Telugu
"ఆత్మ గౌరవంబు నలరంగ చాటరా" అని ఉద్బోధించిన ధర్మన్న కవిగారు వర్ణధర్మం పేరిట భారతీయ సమాజంలో నెలకొని ఉన్న హెచ్చు తగ్గులను నిరసించిన జాతీయ వాది. సమకాలికులు ఆయనను 'ఆది ఆంధ్ర కవి సార్వభౌమ'గా పేర్కొన్నారు.
పదవులు ఆశించకుండా ఆది ఆంధ్ర సంఘాలకు సలహాలిస్తూ వారంతా సమైక్యంగా ఉండటానికి కృషి చేశారు.
కాంగ్రెస్లో ఉంటూనే 'మాకొద్దీ నల్లదొరతనము' అంటూ గళం విప్పిన ధైర్యశాలి. రాజమండ్రి తాలూకా బోర్డుకు కాంగ్రెసు పార్టీ తరఫున సభ్యునిగా ఎన్నికై కూడా బోర్డు ప్రెసిడెంటు ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థికి వోటు చేయని స్వతంత్రుడు ఆయన.
అంబేద్కర్ గురించి ఆంధ్రదేశంలో మొదట ప్రచారం చేసింది వీరే.
నిమ్న జాతుల అభివృద్ది విషయంలో గాంధీ ఆశయాలను నమ్మి గౌరవించినా ఆచరణలో లోపాలను ధర్మన్న గారు సహించే వారు కాదు. గాంధీ గారు ఆంధ్ర రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమండ్రి వచ్చి హరిజన నాయకులతో సమావేశం నిర్వహించిన సందర్భంలో ధర్మన్న గారు ఆ సమావేశాన్ని బహిష్కరించారు. 'హరిజన నాయకులైతే మా పేటలకు వచ్చి యిక్కడ మాట్లాడాలని' కబురుపెట్టి గాంధీగారినీ, ఇతర కాంగ్రెస్ నాయకులను తమ పేటకు రప్పించి, ఆతిథ్యమిచ్చి తమ గౌరవాన్ని చాటుకొన్నారు.
జాతి చైతన్యం కోసం వారు పడిన తపనను ఈ శతకంలో చూడవచ్చు.
