• Haridasi
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హరిదాసి

    Haridasi

    Pages: 124
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''షహజాదా ! కోపింపకుము. నేనెప్పుడైన పూమాలలను ధరించినది నీవు చూచియున్నావా? ఆ మాలనిటు తెమ్ము నీ యభిమానమును నేను స్వీకరించెదను. నేడు షాఆలం దక్షిణమునకు వెళ్లుచున్నాడు. ఈ మాల వానికి జెందు నేర్పాటు చేయుదును''
అలంఫీురు పూమాలను చేతికి దీసికొన్నాడు. అతడు నావైపు తిరిగి -
''నీవెవరింటి దానివి?'' అని యడిగెను.
''నేను యీ పుష్పలావికకు స్నేహితురాలి బిడ్డను. క్రొత్తగా ఢిల్లీకి వచ్చితిని. ఈమె పాదుషా యంతóపురము జూపింతునని నన్ను బిలుచుకొని వచ్చినది, మహాప్రభువుల దర్శనమైనది'' నేను చేతులెత్తి నమస్కరించినాను. ''ఈ అంతఃపుర మెట్లున్నది?''
''షహన్‌షహా ! దీని వైభవమును చూచి నేను శరీరమునే మరచినాను నేనెక్కడ నున్నానో నాకు తోచుటలేదు'' నా మాటలకు పాదుషా తిన్నగానవ్వెను.
''చతురముగా బల్కినావు. ఆ పంజరములోని చిలుకవలె మాటలాడితివి. నీ విచ్చటనే యుండిపోరాదా?''
''నేను ధైర్యముగా బదులిచ్చినాను.
''పాదుషా అనుగ్రహమైనచో కొదువ యేముండును? నన్ను వివాహము చేసికొన్నచో యిక్కడ నుండుటకే యాక్షేపణము లేదు.
'షహజాదా' ఒక అడుగు ముందుకు వచ్చి మృదులముగ నా చెంపపై గొట్టెను.
''గుడుసు దానవు పాదుషాతో హాస్యమాడుటకు నీ కెంత ధైర్యము !''
అలంఫీురు పలికెను.
''నన్ను పెండ్లాడుదువా? ఈ ముసలి వానిని పెండ్లి చేసికొన్నచో బాగుగనే యుండును. షహజాదా నీవేల దానిని బెదరింతువు ! పల్లెటూరి పిల్ల; ధైర్యముగా మాటాడుచున్నది. నాకు ఈ పూమాల కంటెను - దీనిమాట లెంతయో ముద్దుగా నున్నవి''.

Preview download free pdf of this Telugu book is available at Haridasi