• Hari Vamsamu Purva Bhagamu 2
  • Ebook Hide Help
    ₹ 486
    540
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హరివంశము పూర్వభాగము - 2

    Hari Vamsamu Purva Bhagamu 2

    Publisher: S.R. Book Links

    Pages: 1100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శంభుదాసుడు, ప్రబంధపరమేశ్వరుడు - ఎజ్రాప్రెగ్గడ రచించిన భారతశేష గ్రంథమైన హరివంశము క్రీ.శ.1901లో వావిళ్ళవారు ముద్రించారు. తిరిగి దానిని శ్రీ వేలూరి శివరామశాస్త్రిగారి పరిష్కరణతో వారే 1967లో ప్రకటించారు. ఈ ప్రతిలోనే పాఠాంతరాలు కూడా చూపించారు. ఈ రెండు ప్రతులను పరిశీలించి మేలైన పాఠాలను స్వీకరించి, పాఠాంతరాలను విస్మరించకుండా వాటిని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యానం సాగింది.

హరివంశంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. సంస్కృత - తెలుగు భాగవతాలతో పోల్చి చూసినప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు తారసపడ్డాయి. వలసిన తావుల్లో వాటి ప్రస్తావనలు చూడవచ్చు. వాటిని ఏరుకోవడం పరిశోధకులకూ, లోతుపాతుల్ని స్పృశించడం విమర్శకులకూ విడిచిపెడుతూ హరివంశం పూర్వభాగానికి వ్యాఖ్యానాన్ని ప్రచురిస్తున్నాను.

ఇంతవరకూ ఒక్కసారికూడా వ్యాఖ్యానానికి నోచుకొని ప్రాచీన సుప్రసిద్ధకవుల కావ్యాలకు వ్యాఖ్యానాలు సంతరించడం, అలాగే ఇంతకుముందు వ్యాఖ్యానాలు వచ్చినా సుప్రసిద్ధకావ్యాలకు నేటి పాఠకలోకానికి సులభగ్రాహ్యంగా ఉండేలా పాఠకమిత్ర పద్ధతిలో వ్యాఖ్యానాలు సంతరించడం మా ఆశయం. అలా పరిశీలించినప్పుడు ఎఱ్ఱనగారి హరివంశం నా దృష్టికి వచ్చింది.

ఎఱ్ఱన రచించిన హరివంశానికి కూడా ఇంతవరకూ వ్యాఖ్య రాలేదు. అది పూర్వోత్తరభాగాలుగా ఉన్న బృహత్తరమైన గ్రంథం. అందులోని పూర్వభాగానికి వ్యాఖ్యానం ఇప్పుడు ప్రచురిస్తున్నాను. ఉత్తరభాగానికి వ్యాఖ్యానం ప్రస్తుతం నడుస్తోంది. దానిని శ్రీకృష్ణానుగ్రహంతో త్వరలో అందించాలన్నదే సంకల్పం.

- బేతవోలు రామబ్రహ్మం

ఇది హరివంశము పూర్వభాగ వ్యాఖ్యానానికి రెండవ భాగం.

గమనిక: " హరివంశము పూర్వభాగము - 2 " ఈబుక్ సైజు 5.6mb
Preview download free pdf of this Telugu book is available at Hari Vamsamu Purva Bhagamu 2