-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
హరి నీమయమే అంతాను (free)
Hari Neemayame Antanu - free
Publisher: Self Published on Kinige
Pages: 400Language: Telugu
''హరినీమయమే అంతాను'' అనబడే ఈ సంకీర్తనా స్రవంతిని మొదలుపెట్టినప్పుడు నా మనస్సులో వున్న ఆలోచన నా అంతిమ శ్వాసదాకా యెన్ని కీర్తనలు అన్నమాచార్యులవారివి వివరించగలిగితే అన్ని వివరిద్దామని మాత్రమే.
ఈ 'హరి నీమయమే అంతాను'లో నేనెన్నుకున్న అన్నమయ్య కీర్తనలకు భావక్రోడీకరణతో వివరించిన పద్య వివరణ అనుబంధంగా ప్రతి కీర్తన చివరిగా యిచ్చాను. ఇది నా ఆత్మతృప్తికి నేనెన్నుకొన్న హరిమార్గం. తాత్పర్య వివరణలో కూడా కొంత వ్యత్యాసం చూపించాను. తెలియని పదములకు పాఠకులు అర్థం తేలికగా గుర్తుపట్టి అర్థం చేసికొనగలరు. నేను ఈ నా ప్రస్తుత ప్రయత్నంలో అవే కీర్తనలను వర్ణానుక్రమముగా అమర్చి ఉపోద్ఘాత రహిత తాత్పర్య వివరణను అందిస్తున్నాను. ప్రతి కీర్తనకు 'తాళ్ళపాక పద సాహిత్యము యొక్క సంపుటి, కీర్తన సంఖ్య, కీర్తన రాగం మొదలైన వివరములను పొందుపరచాను. భక్తి కంటే తరించే మార్గం జ్ఞానం కానీ భక్తి లేని జ్ఞానం పరిమళంలేని పుష్పం. భక్తి జ్ఞానం రెండూ వున్నవాడికి మోక్షం ఇంకా సుగమం అవుతుంది. ఈ కీర్తనలు భక్తి ఇనుమడింపజేసికోవానికి ఉపయోగపితే వీటి తాత్పర్యవివరణ జ్ఞానం పెంపొందించుకోవానికి దోహదపడుతుంది అనే మాట నిజం.
- అమరవాది సుబ్రమణ్యదీక్షితులు

- FREE
- FREE
- FREE
- FREE
- FREE
- FREE