• Hara Hara Mahadeva
  • Ebook Hide Help
    ₹ 138
    153
    9.8% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • హర హర మహాదేవ

    Hara Hara Mahadeva

    Publisher: S.R. Book Links

    Pages: 240
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ అప్పయ్య దీక్షితులవారి జీవిత చరిత్ర తెలుగువారికి ఆదర్శప్రాయమైనది. తమిళులు శ్రీ అప్పయ్యదీక్షితులవారిని పరమ మాహేశ్వరుడిగా పూజిస్తారు. శివుడి బ్రహ్మత్వాన్ని నిరూపించి, శివాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, ప్రవర్తింపచేసిన తపోసంపన్నుడు, శివయోగి ఆయన!

నిజానికి, ఆయన తెలుగింటి బిడ్డ! ఆంధ్రత్వాన్ని, ఆంధ్రభాషను ఎన్నో జన్మల తపోఫలంగా ధీరగంభీరంగా ప్రకటించిన మహాకవి. శివరూపంలో విష్ణువును, విష్ణురూపంలో శివుని ధ్యానించి ప్రసన్నం చేసుకున్న అద్వైతమూర్తి, 400కు పైగా అద్వైత గ్రంథాలను వ్రాసి, ప్రజలను పరమత ద్వేషంలోంచి శాంతిమార్గంలోకి మళ్ళించిన అవతారపురుషుడు శ్రీ అప్పయ్య దీక్షితుల వారి పుణ్యకథ చదివిన వారికి సుగతులు కలుగుతాయి.

శైవ, వైష్ణవ విబేధాలను అంతరింపచేసి. జనావళిని ఆధ్యాత్మిక ఉన్నతులుగా తీర్చిదిద్దిన మహనీయులు శ్రీ అప్పయ్య దీక్షితులు. విష్ణువును శివరూపంలోనూ, శివుణ్ణి విష్ణురూపంలోనూ సంభావిస్తూ, ఒకే శ్లోకంలో హరిహర స్తుతి చేసిన మహాకవి ఆయన.. చిదంబరం నటరాజస్వామి దేవాలయ ప్రాంగణంలో వరదరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయటం, కాశీతో సమానంగా విద్యాదానం చేయగల మహావిద్యాలయాలు నెలకొల్పటం, మతపరమైన అంశాలలోకి మితిమీరిన ప్రభుత్వ జోక్యాన్ని నివారించటం. రాయలవారి అనంతరం కల్లోల స్థితిలో పడిన విజయనగర సామ్రాజ్య పాలకులకు మార్గదర్శనం చేయటం, ప్రజలలో ఐకమత్యాన్ని సాధించి శాంతిని నెలకొల్పటం ఇవన్నీ దీక్షితులవారు సామాజికంగానూ, మతపరంగా కూడా సాధించిన ఘన విజయాలు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అత్యున్నత "కళారత్న"(హంన)పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారాల గ్రహీత, శతాధిక గ్రంథకర్త, తెలుగు భాషా సంస్కృతుల మూలాలను వెలికి తెస్తున్న పరిశోధకుడు, తెలుగువారి ఆహారచరిత్రవేత్తగా ప్రసిద్ధుడు డా. జి.వి. పూర్ణచందు తెలుగు పాఠకులకు అందిస్తున్న అమూల్య రత్నం ఈ గ్రంథం.

తెలుగువాడిగా పుట్టినందుకు, తెలుగువాడిగా జీవిస్తున్నందుకు, తెలుగులోనే మాట్లాడుతున్నందుకు గర్వించేలా మనలో దైవభక్తినీ, దేశభక్తినీ, భాషానురక్తిని కలిగించే మహత్తర రచన ఇది.

- పబ్లిషర్స్

గమనిక: "హర హర మహాదేవ" ఈబుక్ సైజు 14.7 mb

Preview download free pdf of this Telugu book is available at Hara Hara Mahadeva