-
-
హెచ్.ఐ.వి-ఎయిడ్స్ సమగ్ర విజ్ఞానము
HIV AIDS Samagra Vignanamu
Author: Dr. G. Samaram
Pages: 209Language: Telugu
ఎయిడ్స్ అనేది కేవలం వైద్య సమస్యే కాదు. ఇదొక సామాజిక సమస్య, ఆర్థిక సమస్య, నైతిక సమస్య, ఉత్పాదక శక్తితో ఉరకలేయవలసిన యువత ఎయిడ్స్కి గురికాగా జీవచ్ఛవాలుగా మారుతున్నారు. ఎయిడ్స్ సోకి తల్లిదండ్రులు మరణిస్తూ ఉంటే వారి సంతానం అనాధలుగా మారుతున్నారు. ఇటువంటి దయనీయ పరిస్థితిని ఎయిడ్స్ విజ్ఞానంతో అధిగమించవచ్చు. జనచైతన్యమే ఎయిడ్స్ నివారణకి సరైన మార్గం. ఎయిడ్స్ లేని ప్రపంచం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఎయిడ్స్ నివారణ రంగంలో కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ తోడ్పడే విధంగానూ, ఎయిడ్స్ బారినపడి బాధామయ జీవితాలు గడుపుతున్న వారికి సహాయపడే విధంగానూ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం రాశాను. 20 సంవత్సరాలుగా HIV/AIDS రంగంలో, కేర్ & సపోర్టు కార్యక్రమాలలో గడించిన అనుభవంతో ఈ పుస్తకం రాశాను. ప్రతి ఒక్కరు ఈ పుస్తకాన్ని చదివి తమ సలహాలని, సూచనలని అందివ్వాలని కోరుతున్నాను.
- డా. సమరం
Good Book
Dr.Samaram doesn't need introduction
Very useful information but may be a bit difficult some parts of the book for ordinary public.more books are needed on this topic.