-
-
గుత్తొంకాయ్ కూర - మానవ సంబంధాలూ
Guttonkaya Koora Manava Sambandhalu
Author: Sri Ramana
Publisher: Monica Books
Pages: 198Language: Telugu
మనిషి బుద్ధిజీవి కాబట్టి, యీ భూగోళం దానిపైని సమస్త జీవకోటి తన కోసమేనని అనుకుంటాడు. ఇతర ప్రకృతి వనరులు, భూగర్భ సంపదలతో సహా తనవేననే భ్రమలో వుంటాడు. అన్నిటితో పాటు తనూ వొక జీవినని ఎప్పుడూ అనుకోడు.
అందుకని సృష్టిలోని సమస్త చరాచర వస్తుకోటితో మనకు సంబంధాలు వుండి తీరుతాయి. అందుకే మానవ సంబంధాలను ఎంచుకున్నాను. వీటిని దేనితోనైనా ముడిపెట్టవచ్చు. ఈ గోళంలో జడ చేతన పదార్థాలు అయిపోతే మరో గ్రహానికి వెళ్లి సంబంధాలను కొనసాగించవచ్చు. దీనివల్ల రచనా వస్తువుకి కరువు యిప్పట్లో రాదని మీ లాగే నేనూ నమ్మికతో వున్నాను. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక కవితా సంపుటిని ఆవిష్కరిస్తూ - "మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే యీ కవిగారి రచనలలో అక్కడక్కడ కవిత్వం కూడా కనిపిస్తుంది" అని స్పష్టం చేశారు. అలాగే మీరు యీ పుస్తకంలోని వ్యాస పరంపరను శ్రద్ధగా చదివినట్లయితే, అక్కడక్కడ హాస్యం కూడా తగులుతుందని మనవి చేస్తున్నాను.
- శ్రీరమణ
- ₹130.5
- ₹75.6
- ₹81
- ₹64.8
- ₹102.6
- ₹162
preview page is not working.
చదవడం పూర్తయ్యింది. బావుంది అని అనడం కన్న పుస్తకం చదువుతుంటే ఒక ఫ్రెండ్తొ మాత్లడుతున్న అనుభవం కలిగింది. హాస్యానికి యెక్కడ తగ్గలేదు. యెటకారం కూడా!
అక్కడక్కడ టాపిక్కి లింక్ లేకుండ అనవసరంగ అభిప్రాయలు జోడించారనిపించింది. కొన్ని టాపిక్స్ అయితే అంటీ అంటనట్టుగా ముగించేసారు.
శ్రీరమణ ఇంటర్వ్యూ కినిగె పత్రికలో ఇక్కడ:
http://patrika.kinige.com/?p=447