-
-
గురువందనమ్
Guruvandanam
Author: Darshanam
Publisher: Marumamula Rukmini
Pages: 96Language: Telugu
శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి తెలుగునాట విజయయాత్ర సందర్భంగా దర్శనమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక వెలువరించిన విశిష్ట సంచిక ఈ "గురువందనమ్".
* * *
జగద్గురువుల భాషణములు అమృతాన్ని వర్షిస్తాయి. వారి శాస్త్ర పాండిత్యం ఎంత నిరుపమానమో వారి సంభాషణా చాతుర్యం అంత అనిర్వచనీయం. సంస్కృతం, కన్నడం, తెలుగు, తమిళం, హిందీ భాషలలో వీరు చేసే ఉపన్యాసాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి. స్థాలీపు లాక న్యాయంగా వీటిని ఇక్కడ ఉదహరిస్తున్నాము.
"ప్రతి ధనవంతుడు ఒక పేదవానికి, అతని కాళ్ళమీద అతను నిలబడే రకంగా సహాయం చేసినప్పుడే, మనం పేదరికాన్ని నిర్మూలించగలం. కొన్ని నీటి బిందువులు కలిస్తే సముద్రమవుతుంది. ధనవంతులందరూ కొద్దిగా సహాయం చేస్తే పేదరికాన్ని నిర్మూలించవచ్చు."
"మన కోసమే మనం జీవించడం వ్యర్థం. మన సంతోషం కొరకు మాత్రమే మనం జీవించినట్లయితే మనం జంతువుల కంటే కూడా ఘోరం. వృక్షం రుచిగల తన పళ్ళను తాను భక్షించదు. ఇతరులకు అందిస్తుంది. ఇతరులకు సహాయం చేయడం, ఇతరుల ఆనందం కోసమే ప్రవర్తించడం నిజమైన ఆనందం."
"సామాజిక సేవాకార్యక్రమాల విలువలను అన్ని మతాలు గుర్తించాయి. పాఠశాలలు, వైద్యశాలలు, అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు నిర్వహించడానికి మనమందరం అద్భుతంగా పనిచేస్తూ పేదవారికి అవసరమైన సహాయం చేస్తునే ఉన్నాం. ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. లక్షల మంది పేదరికంతో బాధ పడుతున్నారు. మన సహాయం కోసం అర్రులు చాస్తున్నారు. లక్షల మంది ఆధ్యాత్మిక లేమితో బాధ పడుతున్నారు. వెంటనే వారికి సహాయం చేయాలి. ఈ రెండు రకాల పేదరికాన్నీ నిర్మూలించాలి. అప్పుడే భూమి సుఖశాంతులతో నిండి స్వర్గమవుతుంది."
"సనాతన ధర్మాన్ని ఆచరించండి. ఎప్పుడూ నిజం పలకండి. ప్రతీ రోజూ దైవ ప్రార్థన చేయండి. చేతనైనంత పరోపకారం చేయండి. ఎట్టి పరిస్థితులలోనూ ఎవరికీ హాని చేయకండి. ఎప్పుడూ దయతో ఉండండి. మీకు సదా మా ఆశీస్సులు."
