• Gurukulam
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • గురుకులం

    Gurukulam

    Author:

    Pages: 121
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


" మాష్టారూ .....ఏంటి ఈ మధ్య అదోలా కనిపిస్తున్నారు ? " అమాయకంగా అడిగింది విజయ మేడం. హరిక్రిష్ణ మాష్టారు చిన్నగా నవ్వుకున్నారు. ఇద్దరూ మెయిన్ రోడ్ దిగి నడుచుకుంటూ స్కూల్ లోపలికి వస్తున్నారు.
" అదోలా కనిపించడం అంటే ? " మరింత అమాయకంగా అడిగారు హరిక్రిష్ణ
కిల కిలా నవ్వేసింది విజయా మేడం. అతని చేత 'మీరంటే నాకు ఇష్టం' అని చెప్పించాలని ఆమె తాపత్రయం. కానీ అతను బయటపడడు. ఆమె వదలదు. ఇదే వాళ్ళిద్దరి మధ్యా చాలా కాలం నుండి సాగుతున్న ఆట! ఒకరి మీద ఇంకొకరికి అంతులేని ఇష్టం. బయటపడాలంటే అడ్డుపడుతున్న అహం! ప్రేమలో అహం అనేది చొరబడకూడదని వాళ్ళకీ తెలుసు కానీ మానవ సహజమైన ఫీలింగ్స్ ఇద్దరినీ కంట్రోల్ చేస్తున్నాయి.
" అదోలా కనిపించడం అంటే నిద్ర తిండి సరిగ్గా లేనట్టు, పరధ్యానంగా ఉన్నట్టు, బెంగతో చిక్కిపోతున్నట్టు అన్న మాట " చిలిపిగా చెప్పింది విజయా మేడం.
" ఊరుకోండి మేడం నాకేం బెంగ? సుబ్బరంగా తింటూ దుక్కలా ఉన్నాను " అంటూ గట్టిగా నవ్వేసాడు హరి.
తర్వాత వాళ్ళ సంభాషణ స్కూల్ విషయాల మీదకి మళ్ళింది. " కొత్తగా వచ్చిన పిల్లలు ఎలా చదువుతున్నారు ? " అడిగాడు హరి.
" ఫర్వాలేదు.... ఇంకొంచెం శ్రద్ధ పెట్టాలి. అయినా ముక్కుపచ్చలారని పిల్లలు. ఈ వయసులో తల్లిదండ్రులకి దూరంగా ఉండి చదువుకుంటున్నారు. వాళ్ళని గట్టిగా మందలించడానికి కూడా మనసొప్పడం లేదు. అందరూ తెలివైన పిల్లలే కదా . వాళ్ళే చదువుతారులెండి " చెప్పింది విజయా మేడం.
" సరే .... మనం మాత్రం పిల్లలకి వీలైనంత సబ్జెక్ట్ నేర్పడానికే ప్రయత్నిద్దాం " అంటూ నవ్వేసాడు హరి. ఇద్దరూ నడుచుకుంటూ క్లాసు రూములదాకా వచ్చి విడిపోయారు. ఇదంతా స్టాఫ్‌రూంలో కూర్చున్న నాగరాజు మాష్టారు గమనిస్తున్నారని వాళ్ళకి తెలీదు. నాగరాజు పెదవులపైన విషపు నవ్వొకటి మెరిసి మాయమైంది.

Preview download free pdf of this Telugu book is available at Gurukulam