-
-
గురుగ్రహ ఉపాసన
Gurugraha Upasana
Author: Dr. Jayanti Chakravarthi
Pages: 124Language: Telugu
గురుగ్రహ ఉపాసన
ఈ కలియుగం గ్రహాధీనం. మానవుల జీవితాల మీద నవగ్రహాల ప్రభావం ఎంతో ఉంది. ప్రతి మనిషి తను జన్మించినప్పటి నుంచీ మరణించేవరకూ వారి వారి పూర్వకర్మ ఫలాలను అనుసరించి, ప్రస్తుత జన్మలో గ్రహస్థితులు నిర్ణయించబడి ఉంటాయి. నవగ్రహాలన్నీ వేటికవే ప్రత్యేకమైన ప్రతిపత్తిని కలిగి వివిధ శుభాశుభాలకు కారణమవుతుంటాయి. ఈ నవగ్రహాలలో ఐదవ గ్రహమైన గురుగ్రహానికి ఎంతో ప్రాముఖ్యత వున్నది.
గురుగ్రహ ఉపాసన అనే ఈ గ్రంథంలో గురుడికి సంబంధించిన తాంత్రిక మంత్రాలని, వాటిని ఉపాసించే విధానం సవివరంగా అందిస్తున్నాము.
గురుగ్రహ మంత్ర జపహోమ విధానాలతో పాటు అదనంగా గురుడి అనుగ్రహం సత్వరం లభించటానికి లాల్ కితాబ్ గ్రంథంలో చెప్పిన గురుగ్రహ ప్రభావం - నివారణోపాయాలు, అలాగే గురుగ్రహానికి సంబంధించిన కవచ సూత్రాలు, స్తుతులతో పాటు గురుగ్రహ అధిష్టాతృదేవతలైన శ్రీ శివసహస్రనామ, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ గురుదత్తాత్రేయుల స్తోత్రాలని, అలాగే గురుగ్రహ అంతరిక్ష దేవత అయిన శ్రీ తారాదేవి స్తోత్రాన్ని, సంఖ్యాపరంగా శ్రీ గురుడి సంఖ్యా విశేషాలను కూడా అనుబంధంగా అందిస్తున్నాము.
ఈ గ్రంథంలో తెలిపిన విధంగా అందరూ గురుగ్రహాన్ని ఉపాసించి తద్వారా గురుడి అనుగ్రహంతో సుఖసంతోషాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాము.
- డా. జయంతి చక్రవర్తి

- ₹64.8
- ₹72
- ₹72
- ₹540
- ₹64.8
- ₹72