-
-
గురుదక్షిణ
Gurudakshina
Author: P. S. Narayana
Pages: 127Language: Telugu
చప్పట్లు.... చప్పట్లు.... చప్పట్లు....
రవీంద్రభారతి ప్రేక్షకుల చప్పట్లతో మారుమ్రోగిపోతోంది.
అందరూ నిలుచొని అయిదు నిమిషాల వరకూ చప్పట్లు కొడుతూనే ఉన్నారు.
కావ్యసింధు తలవంచుకొని చిరునవ్వుతో అందరికీ రెండు చేతులూ జోడించి నమస్కరిస్తున్నది. ఆ చప్పట్లు ఆమె ఎప్పుడు స్టేజీ ఎక్కినా వినబడుతుండేవే. అందులో కొత్తేమీ లేకపోవడంతో ఆమె పెద్దగా ఉద్విగ్నతకు లోనుకాలేదు. జంట నగరాల్లో రంగస్థలం మీద ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టడం అతి సహజం అనే విషయం నాటకాల మీద అభిరుచి వున్న అందరికీ తెలుసు.
నాటకం అయిన వెంటనే స్టేజీ మీద ఓ అరడజను కుర్చీలు వేసి, నిర్వాహకులు ప్రత్యేక ఆహుతుల్ని వేదికను అలంకరించమంటూ ఆహ్వానించారు.
మహమ్మారిలా ప్రజల్ని పీడిస్తున్న ఎయిడ్స్ నివారణ దినోత్సవ సందర్భంగా ధన సేకరణకై ఓ స్వచ్ఛంద సేవాసంస్థ కోరిన మీదట ఆరోజు ఆ నాటకం రవీంద్రభారతిలో పిరదర్శింపబడింది. పదిహేను రోజుల క్రితం ఆ సంస్థ అధ్యక్షులు మంచి పేరున్న నాటక సమాజం ‘సింధు సమాఖ్య’ను తమ వంతు సాయం చేయమంటూ కోరారు.
