-
-
గుర్తుకొస్తున్నాయి
Gurtukostunnayi
Author: Polkampally Shanthadevi
Publisher: Surya Prachuranalu
Pages: 200Language: Telugu
కడచిన ఐదు దశాబ్దాలుగా రచనలుచేస్తున్న పోల్కంపల్లి శాంతాదేవి ఇప్పటికి దాదాపు 65నవలలు, 70 కథలు వివిధ పత్రికల్లో ప్రచురించారు. ఈమె తెలంగాణలో అత్యధిక నవలలు రాసిన ఏకైక రచయిత్రి కావడం విశేషం.
ప్రతిరచనలో పాఠకులకు ఒక సందేశాన్ని అందించడం శాంతాదేవి రచనల్లో ఒక ప్రత్యేకత కాగా చక్కటి భాష, సరళమైన సంభాషణలు పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి. స్త్రీవాదం అంటే ఏమిటో తెలియని రోజుల్లో పురుషాహంకారాన్ని ధైర్యంగా ఎదిరించే పాత్రలను తన రచనల్లో ప్రవేశపెట్టి స్త్రీ చైతన్యానికి కారకులయ్యారు.
వీరి కొన్ని నవలలు కన్నడంలోకి అనువదించబడ్డాయి. ‘చండీప్రియ’ నవల వెండితెరపై, చలనచిత్రంగా రూపొందగా, ‘పుష్యమి’ బుల్లితెరపై సీరియల్‌గా ప్రసారమైంది. జీవనసంగీతం, ప్రేమబంధం, అడవి మంటలు - నవలలు బహుమతుల నందుకున్నాయి.
ఈమె బహుముఖ ప్రజ్ఞకు గుర్తింపుగా తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మనిధి పురస్కారంతో పాటు ‘ నైనా’ నవలకు ‘రచయిత్రి ఉత్తమరచన’ పురస్కారాన్ని, సుశీలా నారాయణరెడ్డి పురస్కృతిని అందుకున్నారు.
- తాళ్ళపల్లి మురళీధర గౌడు
