-
-
గురజాడ నాటకములు
Gurajada Natakamulu
Author: Gurajada Apparow
Publisher: BPMD Publications
Pages: 166Language: Telugu
"దేశమును ప్రేమించుమన్నా
మంచియన్నది పెంచుమన్నా
వట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టి మేల్ తలపెట్టవోయ్!"
అని దేశభక్తిని, సమాజ హితాన్ని తేలిక మాటలలో ఉద్బోధించిన మహాకవి మన గురజాడ. వాదోపవాదాల సంగతెలా ఉన్నా తెలుగులో తొట్ట తొలి కథానికా రచయితగా ఆయన తరువాత తరం కవులకు కథన దిశా నిర్దేశం చేశారు. ఆనాటి సమాజంలో ఉన్న దురాచారాల మీద వారు ఎక్కు పెట్టిన రచనాస్త్రం "కన్యాశుల్కము" నాటకం. తెలుగు నాటకాలలో అత్యధిక సార్లు ప్రదర్శింపబడిన నాటకంగా ప్రశస్తిని, సంఘంలో పేరుకుపోయిన దురాచారాల గురించి పండితపామరులంతా ఆలోచించేలా చేసి అఖండ గౌరవాన్ని అందుకుంది.
ఆ మహాకవి రచించిన మరో రెండు నాటకాల సంగతి మనలో చాలామందికి తెలియదు. బహుశా కన్యాశుల్కం ప్రభ ముందు అవి మరుగున పడి ఉండుండవచ్చు.
"కొండుభట్టీయము", "బిల్హణీయము" అనే ఈ రెండు నాటికలూ కూడా పాఠకజనులకు అందుబాటులోకి తీసుకురావాలనే సత్సంకల్పంతో అతి తక్కువ ధరకే ఈ రెండు నాటికల సంపుటిని మీకందిస్తున్నాము.
- బి.పి.ఎమ్.డి.పబ్లికేషన్స్
