• Guppedanta Akasam
  • fb
  • Share on Google+
  • Pin it!
 • గుప్పెడంత ఆకాశం

  Guppedanta Akasam

  Author:

  Pages: 49
  Language: Telugu
  Rating
  4.64 Star Rating: Recommended
  4.64 Star Rating: Recommended
  4.64 Star Rating: Recommended
  4.64 Star Rating: Recommended
  4.64 Star Rating: Recommended
  '4.64/5' From 11 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 5 premium votes.
Description

బయట హోరున వర్షం...ఆ వర్షంలో కూడా పిల్లలు కేరింతలు కొడుతూ నోటు బుక్స్ లో వున్నా కాగితాలను చించి "కాగితం పడవలు చేసి నీటిలో వేసి "ఆనందిస్తున్నారు.
ఆ బాల్యాన్ని ఎంతిచ్చి కొనుక్కోగలం...ఒక ఆశయానికి ఈ సీరియల్ కు రాసే ముగింపు ఎలా మొదలుపెట్టగలను?
రాత్రి తొమ్మిది దాటింది...విభాకరుడెప్పుడో తన ఇంటికి వెళ్ళాడు డ్యూటీ చేయకుండానే...చీకటమ్మ ఆ రోజంతా మా ఊళ్ళో చాలాసేపు వుంది...అని అప్పుడు తెలిసింది.
పవర్ పోయింది. చీకటి కళ్ళతో స్మార్ట్ ఫోన్ మీద ఫ్లాష్ లైట్ వెలుతురులో నా చేతివ్రేళ్ళు అక్షరాలను ఆహ్వానిస్తున్నాయి. ఉపసంహారాన్ని లిఖిస్తోంది.
రచయిత పడే వేదన ఎలా ఉంటుందో తెలిపే పరీక్ష ఈ సీరియల్ కు ముగింపు...
ఈ సీరియల్లో రెండురకాల ముగింపుల్లో నేను ఎంచుకున్నదొక ముగింపు.
పూర్తిస్థాయి క్రైమ్ ఎలిమెంట్ తో సీరియల్ ముగించకూడదు అనుకున్నాను.
కానీ ఈ ముగింపు కన్నా "మించి"మరోటి ఉంటే బావుండనిపించింది.
చేతివ్రేళ్ళలో చిన్నగా నొప్పి...చిన్నముల్లు ఒకటి దాటి రెండు దాటి..మూడు దాటేసరికి చిన్న అసహనం...
బయట హోరున వర్షం..నా ఆలోచనల జడివానను పరిచయం చేస్తున్నట్టు...
నేననుకున్న మూడవ ముగింపు ఎలా ఉండాలి..నాకే తెలియని సందిగ్ధం.
అక్షరాలతో మెస్మరైజ్ చేసే ప్రామిసింగ్ రైటర్
శ్రీసుధామయి గుప్పెడంత ఆకాశం
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రచురణ

Preview download free pdf of this Telugu book is available at Guppedanta Akasam
Comment(s) ...

గుప్పెడంత ఆకాశం నవల కళ్ళముందు జరుగుతున్న కథలా వుంది.చక్కని భాష,భావవ్యక్తీకరణ.రచయిత్రి తొలి సీరియల్ అంటే ఆశ్చర్యంగా వుంది.అంత అద్భుతంగా రాసారు.ఈ నవలలో కొన్ని సన్నివేశాలు ఎక్కడో మన కళ్ళ ముందు జరిగినట్టే వున్నాయి.
"ఈ సీరియల్లో రెండురకాల ముగింపుల్లో నేను ఎంచుకున్నదొక ముగింపు.
పూర్తిస్థాయి క్రైమ్ ఎలిమెంట్ తో సీరియల్ ముగించకూడదు అనుకున్నాను.
కానీ ఈ ముగింపు కన్నా "మించి"మరోటి ఉంటే బావుండనిపించింది.
చేతివ్రేళ్ళలో చిన్నగా నొప్పి...చిన్నముల్లు ఒకటి దాటి రెండు దాటి..మూడు దాటేసరికి చిన్న అసహనం...
బయట హోరున వర్షం..నా ఆలోచనల జడివానను పరిచయం చేస్తున్నట్టు..."
అద్భుతమైన భావవ్యక్తీకరణ..అంతకు మించి భాష తాలూకు అందం...

మేన్ రోబో పబ్లికేషన్స్ పట్ల మీరు చూపిస్తున్న అభిమానానికి థాంక్యూ సో మచ్ ...ఒక రైటర్ తొలి రచనను చదివి అభినందిస్తూ కామెంట్ రాయడం అభినందించవలిసిన విషయం.మీ అభిమానంతో గుప్పెడంత ఆకాశం మరింతగా పాఠకులకు చేరువ కావాలని మేన్ రోబో ఆకాంక్షిస్తోంది .

Sreevaniprasad గారికి నా తొలి సీరియల్ గుప్పెడంత ఆకాశం చదివి మీ అమూల్యమైన అభిప్రాయం వ్యక్తపరిచినందుకు నా కృతజ్ఞతలు.
నేను రాసిన మొట్టమొదటి నవల ఎంతో ఇష్టపడి మరెంతో కష్టపడి రాసినది!!
రాయడమే ఇష్టమైనదైతే మీరు ఈ నవలను చదివి గుర్తించి మీ విలువైన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం నాకు మరింత ఇష్టంగా ఆనందంగా ఉంది!!
ఈ నవలలోని కథాంశం నా ఆశయం..
నా మనసులో ఉద్భవించి అక్షరాల రూపంలో జాలువారి మీ ముందుకు వచ్చింది!!

కొన్ని నవలలు మనసుతో చదవాలి.మస్తిష్కంతో చదవాలి.అలాంటి నవల " గుప్పెడంత ఆకాశం "
ఈ నవలలో జీవితం వుంది.ఒకమ్మాయి పోరాటం వుంది." కొండ అద్దమందు చిన్నగానే " కనిపిస్తుంది..
గుప్పెడంత ఆకాశం పాఠకుల గుండెల్లో అలానే ఉండిపోతుంది.

Waste of time and money,I wish I can give 0 rating