-
-
గుంటూరు కథలు
Gunturu Kathalu
Author: Multiple Authors
Publisher: Abhyudaya Rachayitala Sangham, Guntur
Pages: 567Language: Telugu
తెలుగునాఁటికి నెల్ల నుదీప్తి నొసఁగి
పేరుగన్న ధరిత్రి గుంటూరిసీమ
అచ్చ తెనుగు నుడికారం రుచి చూపించిన మహాకవి తిక్కన పురిటిగడ్డ గుంటూరు. బౌద్ధధర్మం తొలి అడుగులు వేసింది ఈ అమరావతి సీమలోనే. కొండవీటి వైభవచరిత్ర యిక్కడిదే.
సాహిత్య సాంస్కృతిక కళాదీపాలు వెలిగించిన మహామహులెందరో యిక్కడ నడయాడారు. నడయాడుతున్నారు. అన్ని రంగాలతో పాటు సాహిత్యరంగంలునూ గుంటూరుసీమ తెలుగునాట అగ్రగామిగా నిలిచింది. సాహిత్య ప్రక్రియలలో మరీ ముఖ్యంగా కథాప్రక్రియలో గుంటూరుసీమది ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విలక్షణ స్థానం. తొలి కథాకాంతులను అందుకోవడంతో పాటు కథా విమర్శ, అనువాద కథలను తెలుగువారికి మొదటిసారిగా పరిచయం చేసింది గుంటూరుసీమవాసి అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు. ఇంతమంది కథలు ఒక్కజిల్లాలోనే ఉండటం సాధ్యమా అని ఆశ్చర్యపోయే రీతిలో దాదాపు నాలుగువాందల మంది కథలు, అందునా తెలుగు కథను విద్యుత్తేజంతో వికసింపజేసిన పలువురు ప్రసిద్ధులు ఈ సీమవారే కావటం ప్రపంచ సాహిత్యచరిత్రలోనే ఒక విశిష్ట విషయం.
కథానికా చరిత్రను ఉద్యమస్థాయిలో నిర్మించిన గుంటూరు కథకు ఇప్పుడు వందేళ్ళు. కథనే కాదు సకల సాహిత్య ప్రక్రియలనూ ప్రభావితం చేసి సాహిత్యాన్ని ప్రజాపక్షం చేసిన అభ్యుదయ రచయితల సంఘం సరిగ్గా 70 ఏళ్ళ క్రితం ఆవిర్భవించిదీ గుంటూరుసీమలోనే. ఈ సందర్భంగా అరసం-గుంటూరు జిల్లా శాఖ మూడు తరాల కథారచయితల 70 కథల సంకలనాన్ని పాఠకలోకానికి ప్రేమతో సమర్పిస్తోంది.
గుంటూరుసీమ ఆత్మతోపాటు తెలుగుజాతి హృదయాన్ని ఆవిష్కరించే ఈ కథాసంకలనానిది ఇరవయ్యొకటో శతాబ్ది కథాసంకలనాల చరిత్రలోనే ఓ సుస్థిర స్థానం.
- FREE
- FREE
- ₹180
- ₹270
- FREE
- FREE
good one
గుంటూరు గుండె చప్పుడు – “గుంటూరు కథలు” పుస్తకంపై సమీక్ష
http://teblog.kinige.com/?p=3617