-
-
గుండె జబ్బులు - నివారణ చికిత్స
Gunde Jabbulu Nivarana Chikitsa
Author: Dr. Jujjuru Srimannaryana
Publisher: Sree Shanmukheswari Prachuranalu
Pages: 188Language: Telugu
ఈ గ్రంథంలో .... గుండెకు సంబంధించిన వ్యాధులు, వ్యవహారంలో ఉన్న ఆయా రుగ్మతలు అనేకం. స్ట్రోక్, హార్ట్ ఎటాక్, గుండెనొప్పి, అధిక రక్తపోటు, గుండెపోటు, గుండె దడ, గుండె పెరుగుదల, గుండె జబ్బు మొదలైన పలు గుండె జబ్బులను పూర్తిస్థాయిలో సవివరంగా తెలియజేయడమే కాకుండా వాటి చికిత్సా విధానాలు స్పష్టంగా చెప్పారు. చికిత్స ఏ విధంగా ఉంటుంది? అనంతరం జీవనవిధానంలో ఏ ఏ మార్పులు అవసరమో చెప్పారు.
ప్రతి గుండె సంబంధిత వ్యాధికి ప్రథమ చికిత్స ఎలా చెయ్యాలో వివరించారు. కృత్రిమ పరికరాలను ఎట్టి పరిస్థితులలో అమర్చవలసివస్తుందో, గుండె నిర్మాణంలో లోగుట్టులను, గుండె సంరక్షణకు ఆహారానికి గల సంబంధాన్ని తేలతెల్లం చేసారు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల గురించి విపులంగా ప్రస్తావించారు. ఆహారంలో కొవ్వు పదార్థాల స్థానం ఎంతో చెప్పారు. దైనందిన జీవితంలో మధుపానం, ధూమపానంలతో గుండెకు ఎంతటి హాని జరుగుతుందో వివరించారు.
కొలెస్టరాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో, చెడ్డ కొలెస్టరాల్ తగ్గించుకునే మార్గాలనూ తెలియజేసారు. గుండె సంబంధిత వ్యాధులలో ప్రతి వ్యాధికి ఆసుపత్రులలో చికిత్సా విధానాలు ఎలా ఉంటాయో ఏ విధానం, ఏ సమయంలో, ఏ స్థాయిలో అవసరం కాగలదో చెప్పారు. ఆధునిక చికిత్సలు రేడియోథెరపీ, గుండె మార్పిడి మొదలైన వాటిని లోతుగా పరిచయం చేశారు. రక్తపోటు గురించి కూడ విపులంగా వివరించారు. గుండెపోటును వెంటనే గుర్తించగలగడానికి, సకాలంలో చికిత్స పొందే విధానాలను వివరించారు. గుండె మార్పిడి ఎవరికి పనికి రాదో కూడా చెప్పారు. డాక్టర్ శ్రీమన్నారాయణ గారు చిరకాలం నుంచి గుండెజబ్బులకు నాణ్యమైన చికిత్సలు అందించంలోనే కాదు, ఎప్పటికప్పుడు వైద్యరంగంలో ప్రవేశిస్తున్న గుండె వ్యాధులకు సంబంధించిన అధునాతన చికిత్సలను చేయడంలో, చికిత్సానుభవంతో పరిశోధనలు చేయడంలో ఘనపాటి. ఈ కోణంలో ఈ గ్రంథం ఎంతో ప్రామాణికమైందని ఘంటాపథంగా చెప్పవచ్చు. యావన్మందికీ ఈ గ్రంథం గుండె ఆరోగ్యం పట్ల సమగ్రమైన అవగాహన కలిగించమే కాదు, ఒక రిఫరెన్స్ పుస్తకంగా రాణిస్తుందని ఆశిస్తున్నాను.
- శ్రీవాసవ్య
