-
-
గుళిక రసాయనం
Gulika Rasayanam
Author: Vemuri Venkateswara Rao
Pages: 213Language: Telugu
ఈ పుస్తకం రసాయన శాస్త్రం అధ్యయనం చేసే విద్యార్థులని ఉద్దేశించి రాసినది. అలాగని ఇది పాఠ్య పుస్తకం కాదు. జనరంజక శైలిలో రాసినదీ కాదు. మధ్యే మార్గంలో ఉంటుంది. అమెరికాలో ఉన్నత పాఠశాలలో ఉన్న 12 వ తరగతి విద్యార్థులు ఈ స్థాయిలో ఉన్న పాఠ్యాంశాలని చదువుతారు. తెలుగు దేశంలో మొదటి సంవత్సరం కళాశాల విద్యార్థులకి ఇది అందుబాటులో ఉంటుందనే అనుకుంటున్నాను.
ఇది 20 వ శతాబ్దపు ఆరంభ దశలో భౌతిక, రసాయన శాస్త్రాలలో జరిగిన విప్లవాల కథ. ఏదో నవల చదివేసినట్లు కాకుండా కాసింత దృష్టి నిలిపి చదివితే అర్థం అవుతుంది. కథలోని పతాక సన్నివేశాలు చదివి ఆనందించాలంటే గణితం సహాయం లేకుండా సాధ్యం కాదు. అందుకని గణిత సమీకరణాలు అక్కడక్కడ వాడక తప్పలేదు. ఆ సమీకరణాలు ఎలా ఉత్పన్నమయాయో అర్థం కాకపోయినా అవి చెప్పే కథ అర్థం చేసుకుంటే శాస్త్రం లోతుగా అర్థం అవుతుంది.
పేరుకి రసాయన శాస్త్రం అని అన్నాను కానీ, ఈ పుస్తకంలో ఎక్కువగా కనిపించేది రసాయన శాస్త్రానికి కావలసిన భౌతిక శాస్త్రపు పునాదులు, ఆ శాస్త్రంలో కనిపించే వాదాలు (theories), ప్రయోగాలు (experiments), వాటిని ఆకళింపు చేసుకోడానికి కావలసిన గణితం. భౌతిక శాస్త్రంలో వచ్చిన “గుళిక విప్లవం” (quantum revolution) రసాయన శాస్త్రాన్ని ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.
- వేమూరి వేంకటేశ్వరరావు

- FREE
- FREE
- FREE
- ₹162
- ₹162
- ₹162