• Gruha Vastu Chandrika
  • fb
  • Share on Google+
  • Pin it!
 • గృహ వాస్తు చంద్రిక

  Gruha Vastu Chandrika

  Publisher: Mohan Publications

  Pages: 96
  Language: Telugu
  Rating
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 1 premium votes.
Description

జనులు నివసించు స్థలములు, గృహములు శుభ లక్షణములను గలిగియున్న యెడల ధనము, సుఖము, సద్భుద్ధులు, ఆరోగ్యము, సంతతి, ప్రీతిని గొల్పు ఇతర విషయములన్నియు సిద్ధించగలవు. అట్లుగాక వసించు స్థల, గృహాదులు శాస్త్ర దూష్యములై, దుర్లక్షణములతో నుండిన-రోగబాధలు, వ్యవహార చిక్కులు, ఐశ్వర్యహాని, ధననష్టము, దుఃఖము, సంతాన కళత్రహాని, అనేక కష్టనష్టములు సంభవించుటయేగాక 'ప్రాణహాని'కూడ కలుగుగలదు. కావున నివాసమునకు యోగ్యమగునట్లుగా అన్ని విధములా శాస్త్రమును పరిశీలించి, శుభ లక్షణాన్వితమైన స్థలమునందు శాస్త్ర విహితముగా గృహమును నిర్మించుకోవలసి యున్నది.

గ్రహ బలమునకంటెను గృహబలము గొప్పది! అను సామెత గలదు. జన్మించిన సమయమునందలి జాతకము ననుసరించి సంభవింప శుభాశుభములకన్నను, నివసించు గృహము కలిగించు మంచి చెడులు బలము కలిగి యుంటవి. ఈ విధముగా గృహమొసంగు ఫలితములు ఆ గృహ యజమానులకేగాక అందు నివసించెడు ఇతరులకు కూడ కొంతవరకు వర్తింపు చుంటవి.

కావున స్వగృహమైనను, పరగృహమైనను శుభలక్షణములు గలదిగా నుండిన నివసించువారికి మేలు చేయగలదు. శాస్త్రవిధి ననుసరించి, గృహనిర్మాణము గావించినను, ఆ గృహము నిర్మించిన భూమి (స్థలము) దోషయుక్తమై యుండిన మంచి ఫలితములు కలుగుట దుర్లభము! ఆ ప్రకారమే స్థలము అన్ని విధములా యోగ్యమైనదియే అయినను అందు నిర్మించు గృహము శాస్త్ర వ్యతిరిక్త లక్షణములు గలదైనను, స్థల గృహములు రెండును యోగ్యములుగా నున్నప్పటికి ఆ స్థలమందు గృహమునకు నాలుగు దిశలయందు గల ఖాళీ ప్రదేశము తగినంతగా లేకుండినను, పరిమితిని మించి అధికముగానున్నను, అనేక అనర్థములు సంభవించుట నిశ్చయము, అన్ని విషయములు తృప్తికరముగాను, శాస్త్రవిహితముగాను ఉన్నప్పటికీ ఈ స్థలమునకు సంబంధించని పరిసరమునందుగల ఇతరుల
స్థలములు, ఇళ్ళు, చెరువులు, గుంటలు, పర్వతములు, దేవాలయములు, రాజబాటలు మొదలగు వాిద్వారా కొన్ని దోషములు ప్రాప్తించగల ప్రమాదమున్నది. వాటిని గూడ అతి ముఖ్యముగా గమనించుట చాలా అవసరము.

- ప్రచురణకర్తలు

Preview download free pdf of this Telugu book is available at Gruha Vastu Chandrika