-
-
గోర్కీ జీవితం
Gorky Jeevitam
Author: A. Ruskin
Publisher: Kavya Publishing House
Pages: 128Language: Telugu
''మనకి వేలూ, లక్షలూ - డాక్టర్లు, టీచర్లు, యింజనీర్లు, పాఠకులు, నటకులు, కవులు, రచయితలు, శాస్త్రజ్ఞులు -యిల్లాగే యెన్నో రకాల నిపుణులు కావాలి. భూమాత గర్భంలో దాగివున్న, ప్రకృతిలో దాగివున్న అమేయసంపదలని పైకి తీయగల వాళ్ళుగా మనం అందరం తయారు కావాలి. ప్రజల స్వాస్థ్యాన్ని చెగొట్టే పరాన్నభుక్కులుగాని, భూసారాన్ని పీల్చేసే కలుపుమొక్కలుగాని, పరోపజీవులైన బదనికలు గాని, పాడిపంటలకి చెరుపుచేసే క్రిమికీటకాదులు గాని మనదేశంలో వుండనేరాదు. మన దేశాన్నంతన్నీ చక్కగా నందనోద్యానంలాగ తయారుచేయాలి. చిత్తడినేలల్ని మురుగుపారించీ, యెడరుల్లో నీటి వనరులు చేసీ, కాలువలు తవ్వీ, నదీ గర్భాలు లోతుచేసీ, కోట్లమైళ్లు రోడ్లు నిర్మించీ, విశాలమైన అడవులు బాగుచేసీ -భోగభాగ్యాల్ని నిర్మించుకోవాలి...
''నిజమైన చిత్త సంస్కారంగల మానవసమాజాన్ని నిర్మించి, అభివృద్ధి చేయడంలో మనస్సుకి సంతృప్తినీ, సంతోషాన్నీ కలిగించే పని యెంతో చేయగలం. ఇంత కర్తవ్యం మీ ముందు వుంది. ఇందుకొరకై మీకెంతో శాస్త్రీయ విజ్ఞానం అవసరం.”
