-
-
గోరాతో నా జీవితం
Gorato Naa Jeevitam
Author: Saraswathi Gora (Late)
Publisher: Self Published on Kinige
Language: Telugu
ఒక సామాన్యమైన స్త్రీగా, గృహిణిగా జీవితం ప్రారంభించిన సరస్వతీగోరా త్వరలోనే తాను ఒక అసామాన్యమైన వ్యక్తికి జీవితభాగస్వామినని తెలుసుకున్నారు. అంతే, ఇక రెండవ ఆలోచన లేకుందా జీవిత సత్యాన్వేషణ మార్గంపై ప్రయాణం ప్రారంభించారు. కుటుంబజీవనంలో కోడలుగా పాతకి, కొత్తకీ మధ్య సమన్వయం చేసుకోవలసి వచ్చింది. గోరా సహచరిగా క్రొత్తనే స్వీకరించి, సమర్థించుకోవలసి వచ్చింది. సాంప్రదాయాల సముద్రం మధ్య ఒక చిన్న ద్వీపం వలె ఉన్న నాస్తిక జీవితవిధానంలో తమ కుటుంబాన్ని సామాజిక, విప్లవ కృషీవలునిగా మలుచుకోవలసి వచ్చింది. ఆ ప్రయత్నాలు, వాటి పరిణామాల సజీవ గాథ సరస్వతీగోరా జీవిత కథ. నిరాశ ఎరుగక, విరామమివ్వక, నిరంతరం సాగిన నూతన సంస్కార చైతన్యస్రవంతి ఆమె జీవితం. నేటి సామాజిక సంక్షుభిత వాతావరణంలో సరస్వతీగోరా జీవితకథ ఒక ఒయాసిస్సు, ఒక ఆశాకిరణం. ఈ కథనం పాఠకులని పట్టి ఉంచుతుంది. తట్టి చదివిస్తుంది.
I am half-way through...and the book is amazing...and inspiring!! Unputdownable (atleast for me!!)