-
-
గోపిని కరుణాకర్ కథలు
Gopini Karunakar Kathalu
Author: Gopini Karunakar
Publisher: Palapitta Books
Pages: 278Language: Telugu
'వందేళ్ళ తెలుగుకథ' క్రమవికాసంలోని సంపూర్ణ పరిణతి గోపిని కరుణాకర్ 'బారతం బొమ్మలు' కథలో చూడాలి. ఇందులో కథాశిల్పం గురజాడ 'మీ పేరేమిటి' శిల్పం వంటిది. ఎత్తుకున్న నైతిక సమస్య రెండు సామాజిక యథార్థాల ద్వంద్వనీతి సమస్య. ఆ విధంగా చింతాదీక్షితులు, వట్టికోట ఆళ్వారుస్వామి, కాళీపట్నం రామారావు, కేశవరెడ్డి చెప్తూ వచ్చిన సమస్య ఇది. చిత్రించిన వస్తువు దళిత జీవితం. కాని ఈ కథ ఒక గ్రామీణ కథ. లేదా ఒక సామాజిక నైతిక కథ, లేదా ఒక దళిత కథ మాత్రమే కాదు. ఇది ఒక సౌందర్యం గురించిన కథ కూడా.
- వాడ్రేవు చినవీరభద్రుడు
* * *
ఇవి దీపాలు చెప్పుకునే ముచ్చట్లు... అంటే ఆడోళ్ళ ముచ్చట్లు. బ్యాక్యార్డ్ ముచ్చట్లు. ఈ ముచ్చట్లలో ఒక గాసిప్ ఉంటుంది. మన పంచతంత్ర కథల్లో... కతాసరిత్సాగరాల్లో, ఒక టాల్స్టాయ్లో సందడించే చిక్కటి రూపపరమైన ముచ్చట్లు. ఈ ముచ్చట్ల తుంపర దీపం చెప్పే కతల్లో అలవోకగా కురుస్తూనే ఉంటుంది. మన మందెచ్చులోల్ల కతల్లో, మన చిందు బాగోతాల్లో, మన కాటమయ్య కతల్లో, గొల్లసుద్దల్లో... ఉండే ముచ్చట్ల ప్రవాహమది. సామెతల సాలు ఇది. బైరూపులోల్ల, శార్దకాన్ల, దాసరోల్ల, గంగిరెద్దులోల్ల, ఎర్రగొల్లోల్ల లాంటి సంచార జీవుల కళారూపాల తాలూకు ఎసెన్స్ ఈ కతల్లో మనల్ని ఒక ఆధ్యాత్మికమయిన డిస్కోర్స్లోకి తీసుకుపోతుంది. ఈ కతలన్నిటిలో జానపదం సంగీతం తాలూకు 'రామిక్స్' దరువేస్తుంది కూడా.
- సిద్ధార్థ
