-
-
గోపల్లె జనాలు
Gopalle Janalu
Author: Ki. Rajanarayanan
Publisher: Arts and Letters
Pages: 238Language: Telugu
Description
నేను ఒకనాడు నా తల్లినేలకు బయలెక్కితి. “ రైలు బండి ఎక్కేస్తిని, రాత్రంతా ప్రయాణం, ఒకటే నిద్రపోతా ఉంటి. దిడీర్న మెలకవ వచ్చె. రైలు పాకాల జంక్షన్‌కు చేరె. ఇడ్లీ, వడ, దోసె, పొంగల్ అంటూ ఫలహారాలు అమ్మేవాళ్లు ఒకపక్క, టీ, కాఫీ, పేపర్ అమ్మేవాళ్లు మరోపక్క ఎక్కడ చూసినా తెలుగు సద్దే! నాకు ఎక్కడికో దేవలోకానికి వచ్చినట్లు ఉనింది. మా పెద్దవాండ్లు ఉండిన నేలమీద కాలిడుతూనే ఆ ‘మన్వాసన’కు ఏదో తెలియని సంతోషం. నా కండ్లలో నీరు
తెలుగుమాట రుచి తగిలితే నిండా బాగుండు.
తెలుగునాడు తెలుగైతే నిండానిండా బాగుండు
తెలుగుదనాన్ని ఇక్కడి తెలుగువాళ్లతో
మాటాడినపుడు నేను రుచి చూస్తున్నాను.
మనమంతా తెలుగుతల్లి బిడ్డలం.
ఏదో కాలవశాన ఎప్పుడో
‘మేము’ ఈ పక్కలో ఉండిపోతిమి,
‘మీరు’ ఆ పక్కలో ఉండిపోతిరి.
‘మనం’ ఉండేది ఎక్కడైనా
మనం మాట్లాడే ‘తెలుగుభాషను’ వీడకూడదు”.
- కి.రా
Preview download free pdf of this Telugu book is available at Gopalle Janalu
Login to add a comment
Subscribe to latest comments
