-
- A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
-
గోపాలకృష్ణీయము (free)
Gopalakrishneeyamu - free
Author: P M Gopalachary
Publisher: Self Published on Kinige
Pages: 97Language: Telugu
ఆది మానవునినుండి ఆధునిక మానవుని వరకు, కులమేదైనా, మతమేదైనా, జాతి ఏదైనా, లింగమేదైనా రేపు ఏలా ఉంటుందో ? తెలుసుకోవాలనే యావ, తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అదియే జ్యోతి శ్శాస్త్ర ఆవిర్భావానికి మూలం. ఆది మానవుడు కొద్ది కొద్దిగా సంస్కారవంతుడవడానికి కూడా ఈ జ్యోతుల ప్రభావం వలన ఏర్పడే ప్రకృతిలోని మార్పే మూలకారణం. ప్రకృతిలో జరిగే ప్రతి మార్పుకు మనమవునన్నా కాదన్నా మన చుట్టు విశ్వాంతరాలంలో ఉన్న ఈ జ్యోతులే(వివిధ పేర్లతో పిలవబడే) కారణం అవుతాయి.
ఋతువుల మార్పిడి, వాతావరణంలో వివిధ దశలు, ప్రకృతి వైపరీత్యాలు గమనిస్తు వచ్చిన మన పూర్వులు, నక్షత్రాలు గ్రహాలు మొదలైన వాటి వివిధ గమనాలను పరిశీలిస్తూ ఈ జ్యోతిర్వేదానికి నాంది పలికినారు. కాలము, దేశము, దిక్కు వీటిని నిర్ణయించినారు. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా పరిశీలించి తమ అనుభవాలను అనుభూతులను, పరిశీలనా ఫలితాంశాలను ఒక చోట క్రోడీకరించి పొందుపరిచినారు. వాటి ఫలిత స్వరూపమే జ్యోతిశ్శాస్త్రము.
