• Gonuguntla Nageswara Rao
 • Ebook Hide Help
  ₹ 72
  72
  0% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • గోనుగుంట్ల నాగేశ్వరరావు

  Gonuguntla Nageswara Rao

  Pages: 64
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

రాజఠీవి ఆయన సొంతం. అందరినీ గౌరవించడం, ఆదరించడం ఆయన స్వభావం. నలుగురికీ విద్యాదానం చేయడం ఆయన వృత్తి, ప్రవృత్తి.

వ్యాపార కుటుంబంలో జన్మించినప్పటికీ, చుట్టూ వ్యాపార వాతావరణమే ఆవరించి వున్నప్పటికీ.. వాటిని కాదని విద్యావ్యాప్తికి పాటుపడిన తెలుగువారిలో శ్రీ గోనుగుంట్ల నాగేశ్వరరావు గారు ప్రముఖులు. అనేక ప్రముఖ విద్యాసంస్థలను నెలకొల్పడంలో, అలాగే గ్రంథాలయ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో గోనుగుంట్ల వారి కృషి అమోఘం. మహాత్మాగాంధీ ప్రకటించిన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ వారు క్రియాశీలంగా పాల్గొన్నారు.

విద్యావ్యాప్తికి కృషి చేయడమే కాదు.. ఆయన స్వయంగా ఉన్నత విద్యావంతులు. వారి కుటుంబంలోనే ఉన్నత విద్యావంతులు. వారి ఊరిలోనే ఉన్నత విద్యావంతులు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చెందిన శ్రీ గోనుగుంట్ల నాగేశ్వరరావు గారు ఆ వ్యాపార పట్టణంలో మొదటిసారిగా బి.ఎ. పట్టా సాధించిన వ్యక్తి. 1924 జులై 31న జన్మించిన శ్రీ గోనుగుంట్ల నాగేశ్వరరావుగారు స్థానికంగా పదోతరగతి పూర్తి చేసిన తర్వాత.. ఉన్నత విద్యకోసం గుంటూరు పట్టణానికి వెళ్లారు. అక్కడ హిందూ కాలేజిలో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూలో చేరారు. అనంతరం ఏసీ కాలేజిలో బీఏ పూర్తి చేశారు. బీఏ డిగ్రీ చదువుతున్న కాలంలో శ్రీ గోనుగుంట్ల నాగేశ్వరరావుగారికి సహచర విద్యార్థులుగా విశ్వవిఖ్యాత నటసామ్రాట్ శ్రీ నందమూరి తారకరామారావు, కళావాచస్పతి శ్రీ కొంగర జగ్గయ్య, మాజీ ముఖ్యమంత్రి శ్రీ భవనం వెంకట్రామరెడ్డి లాంటి ప్రముఖులు వుండేవారు. వీరితో పరస్పర సాంగత్యం దృఢమైన మైత్రీ బంధాన్ని ఏర్పరిచింది. ఆ స్నేహ బంధం ఎంత బలంగా కొనసాగిందంటే... తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆ అనుబంధాన్ని శ్రీ ఎన్టీయార్ కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఎవరికి ఇస్తే బావుంటుంది, అభ్యర్థి గుణగణాలు ఎలాంటివి లాంటి అంశాలను శ్రీ గోనుగుంట్ల వారితో చర్చించి, వారి సలహా, సూచనల మేరకే టిక్కెట్ ఇస్తుండేవారు. శ్రీ గోనుగుంట్ల వారిని చూస్తే, వారి పంచకట్టు, రాజఠీవి చూస్తే.. అచ్చం ఎన్టీయార్‌ను చూసినట్టు వుంటుంది.

శ్రీ గోనుగుంట్ల నాగేశ్వరరావు గారిది నిత్యం ప్రజాజీవనమే. వారు గ్రామ పంచాయతీ బోర్డులోని న్యాయ పంచాయతీ సభ్యుడిగా, అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ద్వారా ప్రజాజీవితంలోకి ప్రవేశించారు. వివిధ హోదాలు అలంకరించారు. జగ్గయ్యపేట పట్టణంలో వాసవి గ్రంథాలయం నెలకొల్పడంలో కీలక పాత్ర వహించారు. పదిహేడేళ్లపాటు ఆ గ్రంథాలయానికి అధ్యక్షులుగా వ్యవహరించారు. మొదటిసారిగా సంచార గ్రంథాలయాన్ని నిర్వహించారు. వారి కృషికి, గ్రంథాలయోద్యమం పట్ల వారి ఆసక్తికి, అనురక్తికి గుర్తింపుగా 1957లో కృష్ణాజిల్లా గ్రంథాలయ బోర్డు అధ్యక్ష పదవి శ్రీ గోనుగుంట్ల వారిని వరించింది. వీరి పదవీకాలంలోనే కృష్ణాజిల్లాలోని అనేక గ్రామాలలో గ్రంథాలయాలు వెలిశాయి. మహిళలకోసం తొలిసారి ప్రత్యేక గ్రంథాలయాన్ని నెలకొల్పిన ఘనత కూడా వారిదే. గ్రంథాలయాలకు ఈ విధంగా అనేక కొత్త సొబగులు అద్దింది శ్రీ గోనుగుంట్లవారే.

శ్రీ గోనుగుంట్ల వారి చొరవతోనే, కృషితోనే జగ్గయ్యపేట పట్టణంలో బాలికలకోసం ప్రత్యేకంగా ఉన్నత పాఠశాల ఏర్పడింది. పట్టణంలో శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాల ఏర్పాటు దగ్గరనుంచి, దానికి సొంత భవనాలు ఏర్పడడం వరకూ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఈ కళాశాల కార్యదర్శిగా అనేక విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు.

జగ్గయ్యపేట పట్టణంలో అనేక మౌలిక వసతుల కల్పనలో శ్రీ గోనుగుంట్ల వారి పాత్ర మరువలేనిది. మార్కెట్ ఏర్పాటు, సబ్ ట్రెజరీ ఏర్పాటు సహా అనేక విషయాలలో వారి చొరవ, కృషి వుంది. వీటిని సాధించడం కోసం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఎంతో సమయాన్ని వెచ్చించి అందరినీ సంప్రదించడం, అందరినీ భాగస్వాములను చేయడం వారి విశిష్టమైన స్వభావంలో చెప్పుకోదగ్గ విషయం.

శ్రీ గోనుగుంట్ల వారి కృషిని స్థూలంగా చూస్తే.. కేవలం వారి ఊరి అభివృద్ధి కోసం కొన్ని పనులు చేశారని అనిపించవచ్చు. కేవలం మాతృభూమి అభ్యున్నతికోసం తాపత్రయపడిన వ్యక్తిగా కనిపించవచ్చు. కానీ వారు చేపట్టిన కార్యక్రమాలు అనేక గ్రామాలు, పట్టణాలపై బలమైన ప్రభావాన్ని చూపించాయి. ఎందరికో ఆదర్శం, మార్గదర్శకం అయ్యాయి. ఆ బాటలో కనీసం నాలుగడుగులు ముందుకు వేసేలా అందరినీ ప్రేరేపించాయి. విద్య, గ్రంథాలయ. గ్రామాభ్యుదయ చరిత్రలో వారిది ఒక చెరగని ముద్ర. వారు ఆదర్శవంతమైన మైలురాయి. వారి జీవిత గమనంలోని ముఖ్య ఘట్టాలను తెలుసుకోవడం భావితరాలకు స్ఫూర్తిదాయకంగా వుంటుంది.

- వాసిరెడ్డి వేణుగోపాల్

గమనిక: " గోనుగుంట్ల నాగేశ్వరరావు " ఈబుక్ సైజు 10.9mb
Preview download free pdf of this Telugu book is available at Gonuguntla Nageswara Rao